వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియచేశారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సాయి దుర్గా తేజ్ ఎంతో సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకం అని పవన్ కళ్యాణ్ అన్నారు. సాయి దుర్గా తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నటన పట్ల ఎంతో తపనతో ఎదుగుతూ…
మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు మనం చాలా కాలం నుంచి వింటూనే వస్తున్నాం. దానికి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోవడంతో నిజంగానే వారి మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని వారు నేరుగా ఖండించకపోయినా తమ మధ్య ఎంత మంచి బంధం ఉందో అనే విషయాన్ని మాత్రం బయట పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో…
Sri Reddy: సినీ నటి , వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి, గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతూ, ఇప్పుడు క్షమాపణలు కోరారు. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత వంటి నేతలపై ఆమె సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చిన్నా పెద్దా అని భేదం చేయకుండా తన అభిప్రాయాలను పంచుకుంటూ, వైసీపీకి మద్దతు తెలిపింది. అయితే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె…
పోసాని కృష్ణ మురళిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు.. వైసీపీ హయాంలో పోసాని ఇష్టంవచ్చినట్టు మాట్లాడారని.. అయితే, తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పోసాని మాట్లాడరని మండిపడ్డారు
మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాం అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు.. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు..
కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పారుని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్ర లో కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీ లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ లో…
తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఐపీఎస్ అధికారులపై మాజీ సీఎం వైఎస్ జగన్ బెదిరింపులు ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసులు పెడతామన్నారు. మహిళల సంరక్షణ తమ మొదటి ప్రాధాన్యత అని, అందుకోసం ఏం చేయాలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయని పవన్ పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం…
మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీశాఖలో ఎలాంటి సంస్కరణలకైనా తాను సహకరిస్తానని.. అదనపు నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తీసుకువస్తానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి అటవీశాఖ అంటే ఎంతో గౌరవం అని, అటవీశాఖలో అమరులైన 23 మందిని చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. నేడు గుంటూరులో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ…
రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో పవన్ కల్యాణ్ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..? అంటూ మండిపడ్డారు బీజేపీ మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ అధికారంలో ఉండగా వైసీపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు.. ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని స్పందించ లేదు.. విశాఖలో కిషోర్, విజయవాడలో రాజేష్ లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కర్నూలు మొత్తం తిప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు