నిద్రలో పళ్ల సెట్ మింగేసిన వ్యక్తి.. ఆ తరువాత..!
విశాఖపట్నంలోని ఒక వ్యక్తి పళ్ల సెట్ మింగడంతో ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. 52 సంవత్సరాల వయస్సున్న ఈ వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం తనకు కృత్రిమ పళ్ల సెట్ అమర్చుకున్నాడు. సెట్ అటు ఇటు ఊడిపోతుండడంతో, నిద్రలో ఉన్నప్పుడు అది ఊడిపోయి, తెలియకుండానే ఆయన దాన్ని మింగేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది.
పళ్ల సెట్ కుడి ఊపిరితిత్తి మధ్య భాగంలో ఇరుక్కుంది. అయితే ఎడమ ఊపిరితిత్తి సహజంగా పనిచేస్తుండటంతో శ్వాసకోణంలో ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ, అది అలా ఉండటం వల్ల లోపలి భాగంలో ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం ఉన్నది. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో డాక్టర్ సీహెచ్ భరత్, పేషెంట్‌కు ఎక్స్-రే, సీటీ స్కాన్ చేసి కుడి ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని గుర్తించారు.
తన వివాహానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించిన పీవీ సింధు
ఒలింపిక్ పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. పెద్దలు కుదిర్చిన సంబంధంతో వివాహ బంధంలోకి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అడుగుపెట్టబోతోంది. ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పీవీ సింధు వివాహం జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తన వివాహానికి హాజరు కావాలని పీవీ సింధు ఆహ్వానించారు. మంగళగిరిలోని పవన్ కార్యాలయానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు.
మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..
గత నాలుగు రోజులనుంచి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో తెగ హల్చల్ చేస్తోంది. నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య జరిగిన వివాదం కారణంగా ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదట దెబ్బలు తగిలాయని మనోజ్ ఆసుపత్రికి రాగా, ఆ తర్వాత మంచు మోహన్ బాబు దంపతులు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ విడుదలయ్యారు కూడా. ఆ తర్వాత ఈ ఘటనల నేపథ్యంలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేయి చేసుకున్న సంఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై మోహన్ బాబు మీడియాకు క్షమాపణ తెలియజేశారు. అయితే ఈ వాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోసారి మంచి వారి ఫ్యామిలీలో మరో వివాదం చోటుచేసుకుంది.
నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను
నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలే అని ఆయన వ్యాఖ్యానించారు.
అమ్మ ఊరికి వెళ్లిందని, తిరిగి రానంటోంది.. గుండెను పిండేస్తున్న చిన్నారి మాటలు
పుష్ప-2 ప్రీమియర్ (డిసెంబర్ 04) సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ అనే 9 ఏళ్ల పిల్లాడు తీవ్రంగా గాయపడి, 12 రోజులుగా ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఈ ఘటనలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి, ఇందులో కేసులు నమోదు అవడం, అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్, బెయిల్ వంటి సంచలనాలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ ఘటనలో ఒక్క వైపు రూపాయి, మరో వైపు మాత్రం రేవతి కుటుంబం పరిస్థితి కూడా దృష్టికి వస్తుంది.
గ్రూప్ 2 పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్‌తో పట్టుబడ్డ అభ్యర్థి
గ్రూప్-2 పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి మొబైల్ ఫోన్‌తో పట్టుబడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్‌లోని శ్రీ సాయి డెంటల్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో జరిగింది. పరీక్షా ప్రారంభానికి ముందే ఓ అభ్యర్థి ఫోల్డెడ్ మొబైల్ ఫోన్‌ను లో దుస్తుల్లో పెట్టుకుని వచ్చాడు. అనుమానం రావడంతో ఎగ్జామ్ చీఫ్ సూపరిండెంట్ అతడిని చెక్ చేశాడు. ఆ అభ్యర్థి ఫోన్ దొరకడంతో పరీక్ష రాయనివ్వకుండా అతడిని పోలీసులకు అప్పగించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు మేరకు, మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద అతనిపై చర్యలు ఉంటాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.
శిల్పారామంలో ఈ క్రాఫ్ట్ మేళ.. ప్రారంభించిన మంత్రి తుమ్మల
మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ అఫ్ ఇండియా , నేషనల్ జ్యూట్ బోర్డు వారి సౌజన్యంతో ఈ క్రాఫ్ట్ మేళను నిర్వహించడం జరుగుతున్నది. ఈ మేళాకు హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అతిధులుగా విచ్చేసి మేళాను ప్రారంభించారు. శిల్పారామంలో ఉన్న చేనేత కళాకారుల ఉత్పత్తులను సందర్శించారు. శిల్పారామం లో ని బృందావనం ను తిలకించారు. ఈ క్రాఫ్ట్స్ మేళ ను ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 నుండి 31st వరకు నిర్వహించుకుంటున్నం. ఈ క్రాఫ్ట్స్ మేళను గత ౩౦ సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా 20 రాష్టాల నుండి వచ్చిన చేనేత కళాకారులూ వారి ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుంది.చేనేత ఉత్పత్తులకి సంబంధించి వంద స్టాల్ల్స్, జ్యూట్ ఉత్పత్తులకు సంబంధించి 31 స్టాల్ల్స్, శిల్పారామం ఆధ్వర్యం లో చేనేత హస్తకళలు, వూడ్కార్వింగ్, టెర్రకోట మొదలైన ఉత్పత్తులకు సంబంధించి 300 పైగా స్టాల్ల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
విజన్-2047 పేరిట చంద్రబాబు మరో పబ్లిసిటీ స్టంట్.. జగన్ ట్వీట్
విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు. ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పినవాటి అమలు మీద ఎప్పుడూ ఉండదన్నారు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడంమీదనే, ప్రజలను మాయ చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుందంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మరోమారు ఛాంపియన్‌గా ముంబై
దేశవాళీ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ముంబై మరోమారు ట్రోఫీని కైవసం చేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్లో శ్రేయాయ్ అయ్యర్ సారథ్యంలోని ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం డిసెంబర్ 15న జరిగిన ఫైనల్లో మధ్యప్రదేశ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 18 ఓవర్లలోనే సాధించింది. ముంబై విజయంలో స్టార్లు సూర్యకుమార్ యాదవ్, యువ ఆల్ రౌండర్ సూర్యాంశ్ షెడ్గే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా ఈసారి విజయానికి సరిపోలేదు.