Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. ఇది వారి బాధ్యతే అన్న డిప్యూటీ సీఎం
- పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం
- నకిలీ ఐపీఎస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈ అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది. ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నకిలీ ఐపీఎస్‌గా గుర్తించారు. తాజాగా ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. “నకిలీ ఐపీఎస్ అధికారి ముసుగులో ఓ వ్యక్తి వచ్చాడని నాకు తెలిసింది. ఫొటోలు కూడా దిగాడు అని చెబుతున్నారు. పోలీసులు దీన్ని ఎందుకు గమనించలేక పోయారు. ఇది రాష్ట్ర పోలీసు, ఇంటెలిజెన్స్, హోం శాఖ, డీజీపీ బాధ్యత. నాకు కేవలం పని చేయడం మాత్రమే తెలుసు. అధికారం లేనప్పుడు కూడా పని చేశాం. ఇప్పుడూ పని చేస్తున్నాం. పని చేయడం మా బాధ్యత.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Komuravelle: రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
Also Read
ఇదిలా ఉండగా.. అరెస్టయిన నకిలీ ఐపీఎస్‌ను విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పిన సూర్యప్రకాస్.. ట్రైనింగ్ లో ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని ఆ వ్యక్తి చెబుతున్నాడు. తన సొంత కార్ ఇంటి దగ్గరే విడిచి పెట్టి వేరే కార్లో విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించిన సూర్య ప్రకాష్ ను.. విజయనగరం సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్య ప్రకాష్ ఎస్కేప్ అయ్యేందుకు స్థానిక ఏఆర్ కానిస్టేబుల్ సహకరించాడు. తన వాహనాన్ని కూడా ఆ కానిస్టేబుల్ ఇంటి దగ్గరే విడిచి పెట్టాడు. ఇక, సూర్య ప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనుకలు కొలతలు విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పని చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!