Narendra Modi Vizag Tour Live Updates : ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఎయిర్‌పోర్టులో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. సాయంత్రం 4:45 గంటలకు ప్రధాని రోడ్ షో ప్రారంభం కానుంది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈ రోడ్ షో జరగనుంది. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఒక బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేసి, వర్చువల్‌గా అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కి కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 3 గంటల పాటు ప్రధాని మోడీ విశాఖలో ఉండనున్నారు. అనంతరం ఆయన విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళ్లనున్నారు. అయితే.. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..
మత్స్యాకారుల ఆదాయం పెరిగేలా చూస్తాం, ఇప్పటికే వారికి కిసాన్ క్రిడెట్ కార్డులు కూడా అందజేశాం. సముద్రంలో మత్స్యకారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటాం. నేడు చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఏపీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. ధన్యవాదాలు అంటూ మోడీ ప్రసంగం ముగించారు.
విశాఖలో దక్షిణ రైల్వే జోన్‌కు పునాది వేశాం, ప్రత్యేక రైల్వేజోన్‌తో ఏపీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది. రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోంది. పర్యాటక రంగంతో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.
గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏపీకి కేంద్రం కాబోతోంది. దీని ద్వారా ఏపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. మొబైల్ తయారీ రంగంలో ఏపీ గుర్తింపు తెచ్చుకుంది.
చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేము అండగా ఉంటాం, అంధ్రప్రదేశ్ అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం ఏపీ. అభివృద్ధిలో ఏపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.
మీ ఆశీర్వాదంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రసంగాన్ని విన్నాను. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాను. ఏపీ ప్రజల సేవే మా సంకల్పం
భారత్ మాతాకీ జై నినాదంతో మోడీ ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్రప్రజల అభిమానానికి కృతజ్ఞతలు అంటూ తెలుగులో మాట్లాడిన ప్రధాని. ఆంధ్ర ప్రజల అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ముందుగా సింహాచలం నరసింహ స్వామికి నమస్కరిస్తున్నా
విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతున్న బహిరంగ సభలో ప్రధాని మోడీ.. రూ.2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను వీడియో ద్వారా ప్రదర్శించారు.
ఇకపై విజయాలే తప్ప.. అపజయాలు ఉండవు, గత ఐదేళ్లు ఏపీ వెంటిలేటర్‌పై ఉంది. కష్టాలు ఉన్నాయి. వాటిన్నంటినీ అధిగమిస్తాం, అరకు కాఫీని మోడీనే ప్రమోట్ చేశారు. త్వరలో అమరావతికి మోడీ రావాలని కోరుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వాన్నే ప్రజలు కొనసాగించాలి. మధ్యలో వచ్చేవాళ్లతో విధ్వంసాలే ఉంటాయి.
భారత్‌కు ఆర్థిక రాజధాని ముంబై అయితే.. ఏపీకి విశాఖ ఆర్థిక రాజధాని.. విశాఖ ప్రజలకు ఇంతకంటే ఏం కావాలి?, మోడీ సహకారంతో ఏపీని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి.
దేశమే కాదు.. ప్రపంచం మెచ్చిన నాయకుడు మోడీ. హర్యానా, మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది. త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా గెలిచేది ఎన్డీఏనే. సూపర్-6 హామీలు అమలు చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుంది. సంక్షేమం, సుపరిపాలనతో మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఏపీలో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోంది. విశాఖలో మోడీ రోడ్ షో అదిరింది. ఎక్కడికి పోయినా.. మోడీపై విశ్వాసం, నమ్మకం ప్రజలకు కలుగుతోంది. రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. విశాఖ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ కలనెరవేరింది. దేశమే కాదు.. ప్రపంచం మెచ్చిన నాయకుడు మోడీ. హర్యానా, మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది. త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా గెలిచేది ఎన్డీఏనే. సూపర్-6 హామీలు అమలు చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుంది. సంక్షేమం, సుపరిపాలనతో మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోడీ ఏకతాటిపై నడిపిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి మోడీ ఎంతగానో సహకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఏపీకి రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి అంటే ఏంటో ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపిస్తోంది.
ఎంతో మంది ప్రధానులను చూశాం గానీ.. మోడీలా పని చేసిన ప్రధానిని ఇప్పటిదాకా చూడలేదు. అభివృద్ధిలో దేశాన్ని రోల్ మోడల్‌గా ప్రధాని చేశారు. చంద్రబాబు విజన్.. హైదరాబాద్‌లో కనిపిస్తోంది. మోడీ సహకారంతో ఏపీని నెంబర్ వన్‌గా చేస్తాం. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ ఇచ్చారు.
ఏయూ ఇంజనీరింగ్ సభావేదికపై ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సంభాషిస్తూ కనిపించారు. ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. వేదికపై గవర్నర్ నజీర్, పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పురంధేశ్వరి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆశీనులయ్యారు.
ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. సభావేదికపై ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, గవర్నర్ నజీర్ ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ప్రారంభోపన్యాసం చేశారు. మోడీకి స్వాగతం పలుకుతూ.. ప్రధాని చేస్తున్న పలు అభివద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు.
ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగుతున్న సభావేదికపై ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, గవర్నర్ నజీర్ ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా శాలువాతో మోడీని చంద్రబాబు సత్కరించారు.
ప్రధాని మోడీ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ప్రాంగణంలో కూడా మోడీ కలియతిరిగారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ సభా వేదికపైకి చేరుకున్నారు.
విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో ముగిసింది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం కాలేజీ ప్రాంగణానికి మోడీ చేరుకున్నారు. ఓపెన్ టాప్ వాహనం పైనుంచి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురందేశ్వరి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. దారి పొడవునా ప్రజలు పూల వర్షం కురిపించారు.
విశాఖలో అరగంట నుంచి సాగుతున్న మోడీ రోడ్ షో. దారి పొడువునా పూల వర్షం కురిపించిన ప్రజలు.. మోడీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరికాసేపట్లో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు మోడీ చేరుకోనున్నారు.
మోడీ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పూలవర్షంతో ప్రధాని మోడీకి స్థానికులు, అభిమానుల ఘనస్వాగతం. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న మోడీ రోడ్ షో.
విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో ప్రారంభం. రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ
రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోడీ. ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత.
కాసేపట్లో విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో, భారీ బహిరంగ సభ. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో. ఏయూ కాలేజీ గ్రౌండ్‌లోనే బహిరంగ సభ.
విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ. ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్ డేగాకు ప్రధాని. ప్రధాని మోడీకి స్వాగతం పలికిన గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
కాసేపట్లో విశాఖకు ప్రధాని మోడీ. ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్ డేగాకు ప్రధాని. విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి ఐఎన్‌ఎస్ డేగాకు బయల్దేరిన సీఎం చంద్రబాబు. ప్రధానికి స్వాగత పలకనున్న గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.