పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. రెండో దఫా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి.
Sansad Ratna Awards: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ‘సన్సద్ రత్న’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది సన్సద్ రత్న అవార్డు విజేతలను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ అవార్డుకు ఎంపిక అయిన ఎంపీల జాబితాను విడుదల చేశారు.. అందులో విజయసాయిరెడ్డికి చోటు దక్కింది.. సాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ తరపున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తోన్న విషయం…
Parliament: ప్రతిపక్ష ఎంపీలపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ సీరియస్ అయ్యారు. సభా నియమాలను, సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో 12 మంది ప్రతిపక్ష ఎంపీల పేర్లను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండగా, ముగ్గురు ఆప్ ఎంపీలు ఉన్నారు. కమిటీ పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని జగ్దీప్ ధన్ఖర్ ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Dhananjay Munde : ఎన్సీపీ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే కారు జనవరి 4న పర్లీ నగరంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం తర్వాత ముండె ముంబైలో 39 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు.
Indian Citizenship: వృత్తి, ఉద్యోగరీత్యా ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2022లో 2,25,620 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రకటించింది. పార్లమెంట్ లో పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులపై అడిగిన ఓ ప్రశ్నకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్రమోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడారు. ఈ సమయంలో మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలను పడగొట్టడంపై కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులు ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసిందని గుర్తుచేశారు.
Mallikarjun Kharge: వ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ను కదిపేస్తోంది. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ టార్గెట్ గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై లోక్ సభలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డుల నుంచి తొలగించారు.
PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని ప్రసంగం సమయంలో ప్రతిపక్షాలు మోదీ-అదానీ భాయ్ భాయ్ అని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. బుధవారం లోక్ సభలో సమాధానం ఇచ్చిన ఆయన, గురువారం రాజ్యసభలో కూడా కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. Read Also: INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్…
Rahul Gandhi accuses PM of protecting Adani: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన స్పీచ్ పై స్పందించారు. ప్రధాని ప్రసంగంతో నేను సంతృప్తి చెందలేదని.. గౌతమ్ అదానీ, ప్రధాని స్నేహితుడు కాకపోతే విచారణ జరపాలని చెప్పి ఉండాల్సిందని.. ఆయన విచారణ గురించి మాట్లాడలేదని అన్నారు. ప్రధాన మంత్రి అదానీని రక్షిస్తున్నారని స్పష్టం అయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. నేను అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వలేదని అన్నారు. ఢిఫెన్స్…