మహిళలపై లైంగిక వేధింపులు సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. అలాగే మహిళా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వేధింపులు తప్పడం లేదు.
రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంటు అధికార పరిమితులపై సుప్రీంకోర్టు ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతాన్ని నిర్దేశించిన కేశవానంద భారతిలోని సెమినల్ తీర్పు సోమవారంతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దశాబ్దాలుగా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం పదేపదే విమర్శించబడింది. భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఢిల్లీలోని లుటియన్స్‌లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. ఆయన తన తల్లి సోనియా గాంధీతో కలిసి జన్‌పథ్‌లోని నివాసంలో కొంతకాలం ఉంటారు. రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని అధికారులు కోరారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో తరచూ వాయిదాలు, ఆందోళనలతో ఉభయ సభలు అనుకున్న సమయం కంటే తక్కువ నడిచాయి.
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని, పార్లమెంటులో అంతరాయాలకు కారణమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకం అవుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడంపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం కూడా తమ ‘నల్ల’ నిరసనను కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం పార్లమెంట్ ఉభయసభనలు కుదిపేసింది. రాహుల్ గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్ సభ, రాజ్యసభ రెండూ వాయిదా పడ్డాయి.