PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ, విపక్షాలపై పార్లమెంట్ లో విరుచుకుపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం తప్పా మేం చేయడం లేదని, అన్ని అబద్ధపు ఆరోపణలే అని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలపై ఆరోపణలు, కేసు ఓడిపోతే న్యాయస్థానాలపై ఆరోపణలు, తమకు నిర్ణయం అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
PM Narendra Modi's speech in Parliament: పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రపతి దేశంలోని మహిళలు, సోదరీమణులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రాష్ట్రపతి దేశంలో గిరిజనులు ఉన్నతిని పెంచారని అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి, యుద్దం లాంటి పరిస్థితులను భారత్ తట్టుకుందని మోదీ అన్నారు. ఎన్నికల కంటే దేశంలోని 140 కోట్ల ప్రజల సామర్థ్యం, శక్తి గొప్పదని అన్నారు. సమర్థవంతంగా భారత్ సంక్షోభాల నుంచి బయటపడిందని,…
వాతావరణ మార్పులపై పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన 2019లో మహాబలిపురంలోని ఒక బీచ్‌లో చెత్తను ఏరిపారేస్తూ కనిపించారు.
PM-KISAN: రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈ ఆర్థిక సాయాన్ని కేంద్ర పెంచుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) కింద లబ్ధిదారులకు ప్రస్తుతం ఏడాదికి రూ.6000 ఇస్తోంది. అయితే ఈ ఆర్థిక సాయాన్ని పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదని ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ కు తెలియజేసింది.
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే ముందే కేంద్రం చర్చకు రావాలని బీఆర్ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ లోక్‌సభాపక్ష నేత, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దీర్ఘకాలిక పదవీ విరమణ సమస్యను పార్లమెంట్లో లేవనెత్తారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిబద్ధత మరియు కృషిని కొనియాడుతూనే.. ఉద్యోగుల సమస్యలను పార్లమెంటులో ఉక్కు శాఖ మంత్రిని గట్టిగా నిలదీశారు.. విశాఖ ఉక్కు కర్మాగారంగా పేరొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పదవీ విరమణ జరుగుతున్న ఉద్యోగుల సమస్య వలన క్షీణిస్తున్న…
కేంద్రం బడ్జెట్లో రైల్వే శాఖకు పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రికార్డు స్థాయిలో రైల్వేశాఖకు నిధులు కేటాయించారు.