పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభ్య ఛైర్మన్‌గా తొలిసారి సీపీ.రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి.
Parliament Session: రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 30న) అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.
భారత రాజ్యాంగం.. ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం. నవంబర్ 26న దేశమంతా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంది. నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ హాల్లో రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికా నుంచి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
CM Revanth Reddy : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, “బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోడీని గద్దె దించుతాం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లుపై చర్చ జరగాలని కోరుతూ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించాలని రేవంత్ డిమాండ్ చేశారు. “బీసీ కోటా బిల్లులు కేంద్రం…
కాంగ్రెస్ చారిత్రక తప్పిదాలను ప్రధాని పార్లమెంట్లో ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలోనే పీఓకేను భారత్ కోల్పోయింది.. నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందని మోడీ అన్నారు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. అక్సాయ్ చిన్ కు బదులుగా, మొత్తం ప్రాంతాన్ని 'బంజరు భూమి'గా ప్రకటించారని.. దీని కారణంగా మనం దేశంలోని 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవలసి వచ్చిందన్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్లో హాట్‌హాట్‌గా చర్చ మొదలైంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు హైదరాబాద్‌లో ఇటీవల కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌పై సిట్ విచారణ జరపాలని నిర్ణయించబడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు (జులై 28, 2025) జరగబోయే సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) విచారణకు హాజరు కాలేనని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటులో జరగనున్న చర్చ కారణంగా తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం…