కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. విపక్షాలు ఏకం అవుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ఇప్పుడు దేశవ్యా్ప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చర్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. అదే సమయంలో పలు పార్టీల నేతలు కాంగ్రెస్ యువ నేత రాహుల్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
లోక్సభ 64 అధికారిక సవరణలతో ఆర్థిక బిల్లు-2023ని ఆమోదించింది. సీతారామన్ పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు 2023ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్యపై జేపీసీ విచారణను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీల భారీ నినాదాల మధ్య చివరికి వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో బడ్జెట్ సెషన్ లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు రోజంతా వాయిదా పర్వం కొనసాగింది.
దేశాన్ని, పార్లమెంటును అప్రతిష్టపాలు చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం పార్లమెంటులో అన్నారు. ఈ విషయం యునైటెడ్ కింగ్డమ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగానికి సంబంధించినది.
గౌతమ్ అదానీ- హిడెన్ బర్గ్ వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. స్పీకర్ ఓంబిర్లా లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
రణరంగంలో పోరాడి గెలవాలంటే ధైర్యం, ప్రాణాలను పణంగా పెట్టగల మనోస్థితి లక్షణాలతో పాటు యుద్ధనీతి, పోరాట తంత్రాలు, ఆధునిక ఆయుధాలప్రయోగంలో మెలకువ, నైపుణ్యం కావాలి. ఈ శక్తులన్నీ నేటి మహిళలకు ఉన్నాయి.
లండన్ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్ ప్రసంగంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి.
Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో తనను మాట్లాడేందుకు అనుమతి వచ్చేలా కనిపించడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తమాషాలు చేస్తుందని విమర్శించారు.
Parliament : పార్లమెంట్లో మైక్లు స్విచ్ ఆఫ్ చేశారని, తన వాయిస్ని సైలెంట్ చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మూడు రోజుల పాటు తన మైక్రోఫోన్ మ్యూట్ అయిందని ఆరోపిస్తూ లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి బుధవారం స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.