బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకం అవుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడంపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం కూడా తమ ‘నల్ల’ నిరసనను కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 18 ప్రతిపక్ష పార్టీలు ఐక్యపోరాటం చేయనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిపక్ష పార్టీల నిరసన కొనసాగుతుందని, పార్లమెంటులోని గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్షాలందరూ నల్ల బట్టలు ధరించి నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read: Mallu Bhatti Vikramarka: రాహుల్ గాంధీని ఇల్లు ఖాలీ చేయమనడం బీజేపీ కక్ష సాధింపే
పార్లమెంట్‌లోని ఖర్గే ఛాంబర్‌లో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వారు తెలిపారు. విపక్ష నేతల సమావేశంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా ఉన్నారు. డిఎంకె, ఎన్‌సిపి, జెడి-యు, భారత రాష్ట్ర సమితి, సిపిఐ-ఎం, సిపిఐ, ఆప్, ఎండిఎంకె, టిఎంసి, ఆర్‌ఎస్‌పి, ఆర్‌జెడి, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయుఎంఎల్, సమాజ్‌వాదీ పార్టీ, జెఎంఎం నాయకులు పాల్గొన్నారు. విడి సావర్కర్‌కు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆందోళనల మధ్య శివసేన (యుబిటి) హాజరుకాలేదు.
To save one man, Modi ji is trampling the interests of 140 Cr people.
To protect PM's 'Param Mitr', BJP stalls Parliament that discusses people's issues.
If NO wrong is committed, why is Govt shying away from Opposition's demand of a probe by Joint Parliamentary Committee ? pic.twitter.com/53Bz3HEtSE
— Mallikarjun Kharge (@kharge) March 27, 2023
18 పార్టీల నేతలు హాజరయ్యారని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ప్రచారాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్‌లో తెలిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని, అదే శక్తితో ముందుకు సాగుతామన్నారు. “రాహుల్ గాంధీ ఇంటి గురించి ఆందోళన చెందడం లేదు. దేశ ప్రజాస్వామ్యానికి సంబంధించి భారత ప్రభుత్వం ఏం చేస్తున్నా అది పెద్ద సమస్య. ప్రతి ప్రతిపక్ష పార్టీలు కలిసే ఉన్నాయి. ఐక్యంగా ముందుకు సాగుతాం” అని ఆయన అన్నారు.
Also Read: Alibaba founder: చైనాకు తిరిగొచ్చిన జాక్ మా.. స్కూల్ క్యాంపస్ లో ప్రత్యక్షం
నిన్న ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలో భాగంగా ఉదయం నల్ల దుస్తులు లేదా బ్యాండ్‌లు ధరించి పార్లమెంట్ ఆవరణలో పాదయాత్ర చేపట్టారు.అనర్హత వేటు వేసిన కొన్ని రోజుల తర్వాత, రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌస్ కమిటీ నోటీసు పంపింది. బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చినా ఆశ్చర్యపోలేదని కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ అన్నారు.అదానీ వ్యవహారంపై రాహుల్ గాంధీ ప్రధానిని ప్రశ్నించినందున, మోదీ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కుతోందని ఆరోపించారు.