Paris Olympics 2024 PV Sindhu: పారిస్ ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పతకాల వేట ముగిసింది. 2016లో రజతం, 2020లో కాంస్యం గెలిచిన పీవీ సింధు.. ఈసారి ఒలింపిక్స్ 2024లో మాత్రం ప్రీక్వార్టర్స్ వరకే పరిమితమై ఖాళీ చేతులతో ఇంటి ముఖం పట్టింది. గురువారం రాత్రి జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్ లో పివి సింధు 19-21, 14-21 తేడాతో చైనా షట్లర్ ప్రపంచ 9వ…
భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 22 ఏళ్ల లక్ష్య సేన్ ఈ మ్యాచ్‌లో 32 ఏళ్ల స్వదేశీయుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో ఎన్నో పతకాశలతో వెళ్లిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూసింది.
ఒలింపిక్స్ పాల్గొంటే చాలని క్రీడాకారులంతా కలలు కంటూ ఉంటారు. పతకం గెలవకపోయినా ఈ క్రీడల్లో పాల్గొంటే చాలని అహర్నశలు కష్టపడుతుంటారు. అయితే ఈజిప్ట్ ఫెన్సర్ నాడా హఫీజ్ మాత్రం మరో అడుగు ముందు కేసింది. ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగింది. ఈజిప్ట్‌కి చెందిన ఫెన్సర్ నాడా హఫీజ్(26), 7 నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడింది..
పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంపై గురిపెట్టిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ వు హు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది.
Swapnil Kusale Shoots Bronze Medal in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత యువ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు. గురువారం ఛటౌరోక్స్‌లోని నేషనల్ షూటింగ్ సెంటర్‌లో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచి.. కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దాంతో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. ఇప్పటికే షూటింగ్ విభాగంలో భారత్‌కు రెండు 2 పతకాలు వచ్చిన విషయం తెలిసిందే.…
Turkish Shooter Yusuf Dikec goes viral for winning Silver Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో 51 ఏళ్ల టర్కీ షూటర్ యూసఫ్ డికేక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు కారణం అతడు అత్యంత సాదాసీదాగా వచ్చి.. షూటింగ్ ఈవెంట్‌లో పాల్గొనడమే. సాధారణంగా షూటింగ్ ఈవెంట్‌లలో క్రీడాకారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెరుగైన కచ్చితత్వం కోసం ప్రత్యేకమైన సన్‌గ్లాసెస్, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇయర్ ప్రొటక్టర్లను వాడుతుంటారు. యూసఫ్ మాత్రం ఇవేవీ పెట్టుకోకుండానే.. ఎయిర్ పిస్టల్…
పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్‌లో భారత్ రెండు కాంస్య పతకాలు సాధించి శుభారంభం చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకం సాధించింది.
Paris Olympics 2024 India Schedule Today: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. ఇప్పటికే షూటింగ్ విభాగంలో రెండు 2 పతకాలు రాగా.. బుధవారం మనోళ్లు సత్తాచాటారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. బాక్సింగ్‌లో లోవ్లినా బర్గోహైన్ క్వార్టర్ ఫైనల్ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. షూటింగ్‌లో స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు అర్హత సాధించగా.. ఆర్చర్…