Free Visa If Neeraj Chopra Wins Gold: పారిస్ ఒలింపిక్స్ 2024లో స్టార్ జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాపై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. విశ్వ క్రీడల్లో నీరజ్ మరో స్వర్ణ పతకం గెలవడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు. అయితే జర్మనీకి చెందిన 19 ఏళ్ల మాక్స్ డెహ్నింగ్ నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. జర్మన్ వింటర్ త్రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో మాక్స్ 90.20 మీటర్లు విసిరాడు. ఈ సంవత్సరంలో ఈ మార్కును…
Manu Bahaker Is a India Flag Bearer: పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైన విషయం తెలిసిందే. చైనీస్ ప్రపంచ నంబర్ 9 ర్యాంకర్ బింగ్ జావో రన్ చేతిలో 21-19, 21-14 తేడాతో ఓటమిపాలైంది. బ్యాడ్మింటన్ విభాగంలో పతకం పక్కా అని ఆశలు పెట్టుకున్న అభిమానులను సింధు నిరాశపరిచింది. అయితే ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన షూటర్…
Manu Bhaker On X: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత షూటర్ మను భాకర్ చిరస్మరణీయ ప్రయాణం ముగిసింది. శనివారం 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి మరో పతకాన్ని తృటిలో కోల్పోయింది. అయితే, ఆమె వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో, 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 2 కాంస్య పతకాలను సాధించి దేశానికి అందించింది. ఈ సందర్బంగా తన ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ…
Novak Djokovic vs Carlos Alcaraz Final Fight in Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టెన్నిస్ అభిమానులు కోరుకున్న స్టార్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాస్ గోల్డ్ మెడల్ కోసం తలపడబోతున్నారు. టెన్నిస్ ప్రపంచం కళ్లప్పగించి చూసే ఈ ఆసక్తికర పోరు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది. సుదీర్ఘ…
Paris Olympics 2024 India Schedule Today: పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటింగ్ మినహా మిగిలిన భారత అథ్లెట్లు నిరాశపరుస్తున్నారు. పతకాలు తెస్తారనుకున్న పీవీ సింధు, నిఖత్ జరీన్‌తో పాటు పలువురు స్టార్ అథ్లెట్లు ఇప్పటికే ఇంటి ముఖం పట్టారు. మను భాకర్ ‘హ్యాట్రిక్’ కొద్దిలో మిస్ అయింది. ఇక ఇప్పుడు అందరి ఆశలు స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌పైనే ఉన్నాయి. ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరుకుని చరిత్ర సృష్టించిన అతడు బంగారం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ఆదివారం జరిగే…
Lakshya Sen: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు పారిస్ ఒలింపిక్స్లో భారత్ 3 కాంస్య పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మను భాకర్ తొలి పతకం సాధించింది. దీని తర్వాత, ఆమె సరబ్జోత్ సింగ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. అలాగే స్వప్నిల్ కుసాలే 50…
పారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని కోల్పోయింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ మరో పతకం తృటిలో చేజారింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. హోరా హోరీగా సాగిన పోరులో అద్భుతంగా రాణించిన మను.. 4వ స్థానంలో నిలవడంతో పోటీ నుంచి ఎలిమినేట్ అయింది.
పారిస్ ఒలింపిక్స్ లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రవారం జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, తన ఆనందం దానికే పరిమితం కాలేదు. స్వర్ణం గెలిచిన వెంటనే తోటి ఆటగాడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. డబుల్స్ ప్లేయర్ యుచెన్ మెకాళ్లపై కూర్చుని ఉంగరంతో ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో.. హువాంగ్ ఆశ్చర్యం, ఆనందంతో ఓకే చెప్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్ ఇదే…
పారిస్ ఒలింపిక్స్‌లో లింగ అర్హత అంశం చర్చనీయాంశమైంది. గురువారం జరిగిన మహిళల 66 కేజీల విభాగంలో అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ ఇటలీకి చెందిన ఏంజెలా కారినిపై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన 46 సెకన్లకే మ్యాచ్ నుంచి వైదొలగాలని కారిని నిర్ణయించుకుంది. ఖలీఫ్ మాత్రమే కాదు.. ఆ ఛాంపియన్‌షిప్‌లో మరొకరిని అదే కారణంతో తొలగించారు. ఆమె తైవాన్‌కు చెందిన లిన్ యు-టింగ్. లిన్ యు కూడా పారిస్‌లో జరిగిన తన ప్రారంభ మ్యాచ్‌లో మహిళల 57…
పారిస్ ఒలింపిక్స్‌లో ఎనిమిదో రోజు (శనివారం) మహిళా షూటర్ మను భాకర్ పై మరోసారి పతకంపై భారత్ ఆశలు పెట్టుకుంది. నేడు మను 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌లో విజయం సాధించి పారిస్ గేమ్స్‌లో హ్యాట్రిక్ పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మను భాకర్.. భారతదేశానికి ఇప్పటివరకు రెండు కాంస్య పతకాలు సాధించిపెట్టింది.