Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఓటమి
- పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఓటమి
- బెల్జియం చేతిలో 2-1 తేడాతో ఓడిన భారత హాకీ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది. భారత్ తరఫున అభిషేక్ సింగ్ 18వ నిమిషంలో గోల్ సాధించాడు. బెల్జియం తరఫున తిబౌట్ స్టాక్‌బ్రూక్స్, జాన్ డోహ్మెన్ గోల్స్ చేశారు. తొలి క్వార్టర్‌లో భారత్ పొరపాట్లు చేయగా 8వ నిమిషంలో బెల్జియంకు తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే, మొదటిసారి అమిత్ రోహి దాస్ సేవ్ చేయగా, మళ్లీ శ్రీజేష్ అద్భుతమైన సేవ్ చేశాడు. 10వ నిమిషంలో అభిషేక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసేందుకు ప్రయత్నించగా.. బెల్జియం గోల్ కీపర్ గోల్ అనుమతించలేదు. తొలి క్వార్టర్‌లో గోల్‌లు నమోదు కాలేదు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
రెండో క్వార్టర్‌లో భారత్ ముందంజ
రెండో క్వార్టర్‌లో భారత్ దూకుడుగా ఆడి తొలి గోల్ చేసింది. 18వ నిమిషంలో బెల్జియం డిఫెండర్లను దాటవేస్తూ అభిషేక్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేశాడు. అంతకుముందు వివేక్ సాగర్ షాట్ మిస్ అయితే, అభిషేక్ ఎలాంటి పొరపాటు చేయలేదు. 23, 24 నిమిషాల్లో బెల్జియంకు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే శ్రీజేష్ అద్భుతంగా ఆదుకున్నాడు. 25వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను భారత్ మిస్ చేసుకుంది. 26వ నిమిషంలో టామ్ బూన్ గ్రీన్ కార్డ్ పొంది రెండు నిమిషాల పాటు మైదానం వీడాడు. తొలి అర్ధభాగంలో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
మూడో క్వార్టర్‌లో బెల్జియం ముందంజ
మూడో క్వార్టర్‌లో భారత్ ఒత్తిడితో ఆడుతున్నట్లు కనిపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న బెల్జియం 33వ నిమిషంలో థిబ్యూ స్టాక్‌బ్రోక్స్ ఫీల్డ్ గోల్‌తో జట్టును సమం చేసింది. 43వ, 44వ నిమిషాల్లో బెల్జియంకు పెనాల్టీ కార్నర్ లభించగా, దాన్ని శ్రీజేష్ కాపాడాడు. అయితే, 44వ నిమిషంలో జాన్ డోహ్‌మెన్ చేసిన గోల్‌తో బెల్జియం 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్‌కు కూడా పెనాల్టీ కార్నర్ లభించినా అమిత్ రోహి దాస్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
నాలుగో క్వార్టర్‌లో ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. 51వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం లభించినా, అభిషేక్, సుమిత్ గోల్ చేయలేకపోయారు. బెల్జియంకు పెనాల్టీ కార్నర్ లభించినా దానిని గోల్‌గా మార్చలేకపోయింది. 54వ నిమిషంలో రాజ్‌కుమార్ పాల్‌కు ఎల్లో కార్డ్ లభించింది. చివరి నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది, కానీ భారత్ గోల్ చేయలేకపోయింది, దీంతో భారత్ 2-1తో మ్యాచ్‌ను కోల్పోయింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!