లక్ష్య సేన్ బ్యాడ్మింటన్‌లో పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా లక్ష్య సేన్ నిలిచాడు. లక్ష్య 19-21, 21-15, 21-12తో తైవాన్‌కు చెందిన చు టిన్ చెన్‌పై విజయం సాధించాడు. భారత బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ చరిత్రాత్మక విజయం సాధించాడు. క్వార్టర్-ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చు టిన్ చెన్‌పై మూడు గేమ్‌ల ఉత్కంఠభరితమైన గెలుపు పొందాడు.
మిక్స్‌డ్ డబుల్స్ ఆర్చరీ జోడీ ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్ కాంస్య పతక పోరులో అమెరికాతో తలపడింది. ఈ క్రమంలో.. భారత జోడీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత జోడీ తొలి రెండు షాట్‌లలో 17 పాయింట్లు సాధించింది. అదే సమయంలో అమెరికా జోడీ కౌఫ్‌హోల్డ్, అల్లిసన్ తొలి రెండు షాట్లలో 19 పరుగులు చేసి రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. నాలుగో సెట్‌లో భారత జోడీ మొత్తం 35 పరుగులు చేసింది. నాలుగో సెట్‌లో అమెరికా…
భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్ తన సత్తాను చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.
భారత స్టార్ షూటర్ మను భాకర్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది. శుక్రవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. మను క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత క్రీడాకారిణి ఇషా సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇషా క్వాలిఫికేషన్‌లో 18వ స్థానంలో నిలిచింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో ముగ్గురు తల్లులు పతకాలు సాధించారు. బ్రిటన్‌కు చెందిన వెటరన్ హెలెన్ గ్లోవర్.. న్యూజిలాండ్ క్రీడాకారిణులు లూసీ స్పూర్స్, బ్రూక్ ఫ్రాన్సిస్‌లు ఉన్నారు. మహిళల డబుల్ స్కల్స్‌లో స్పూర్స్.. ఫ్రాన్సిస్ బంగారు పతకాన్ని గెలుచుకోగా, మహిళల ఫోర్‌లో ముగ్గురు పిల్లల తల్లి గ్లోవర్ రజతం సాధించింది. కాగా.. స్పూర్స్, ఫ్రాన్సిస్ తమ ఆట ముగిసిన అనంతరం లైన్ దాటి.. తమ బిడ్డలను కౌగిలించుకోవడానికి స్టాండ్‌లలోకి వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో గురువారం జరిగిన పురుషుల 50 మీటర్ల 3-పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. అతను సాధించిన ఈ ప్రత్యేక విజయానికి సెంట్రల్ రైల్వే బహుమతి ఇచ్చింది. ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో కుసాలే ఏడో స్థానంలో నిలిచాడు.
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, ఒలింపిక్ బంగారు పతకాలు ఎక్కువగా బంగారంతో తయారు చేయబడ్డాయి. యుద్ధం అనంతరం ఖర్చులను తగ్గించుకోవడానికి బంగారం మొత్తాన్ని తగ్గించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. భారత్ ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలను గెలుచుకుంది. ఆరో రోజు స్వప్నిన్ కుసానే మూడో కాంస్యం సాధించాడు. కాగా మను భాకర్ తొలి పతకాన్ని సాధించి భారత్ కు శుభారంభం చేసింది. తర్వత సరబ్‌జోత్ సింగ్ తో కలిసి మరోసారి మను బరిలో నిలిచి మరో కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. అయితే నేడు భారత్ మరోసారి మను భాకర్ ను రంగంలోకి దించనుంది. ఆమె 25…