Turkish Shooter Yusuf Dikec goes viral for winning Silver Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో 51 ఏళ్ల టర్కీ షూటర్ యూసఫ్ డికేక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు కారణం అతడు అత్యంత సాదాసీదాగా వచ్చి.. షూటింగ్ ఈవెంట్‌లో పాల్గొనడమే. సాధారణంగా షూటింగ్ ఈవెంట్‌లలో క్రీడాకారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెరుగైన కచ్చితత్వం కోసం ప్రత్యేకమైన సన్‌గ్లాసెస్, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇయర్ ప్రొటక్టర్లను వాడుతుంటారు. యూసఫ్ మాత్రం ఇవేవీ పెట్టుకోకుండానే.. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పాల్గొన్నాడు.
టర్కీ షూటర్ యూసఫ్ డికేక్ ఎలాంటి సన్‌గ్లాసెస్, ఇయర్ ప్రొటక్టర్లను పెట్టుకోకుండా సాదాసీదాగా వచ్చి తన పార్టనర్ తర్హాన్‌తో కలిసి బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పాల్గొన్నాడు. అంతేకాదు మెరుగైన ఆటతో రెండో స్థానంలో నిలిచి.. రజత పతకం సాధించాడు. దీంతో యూసఫ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వయసులో అలా ఎలా షూట్ చేశాడబ్బా, అతడి ఏకాగ్రతకు సలాం కొట్టాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Gold Price Today: నిన్న 800, నేడు 500.. బంగారం ప్రియులకు మళ్లీ షాక్! వెండి ధర పైపైకి
యూసఫ్ డికేక్ తొలిసారి 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డాడు. యూసఫ్‌కి ఇది ఐదో ఎడిషన్. అయితే ఇదే అతడి మొదటి ఒలింపిక్ పతకం కావడం విశేషం. కెరీర్ ఆఖర్లో ఇలా సాదాసీదాగా ఆడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందుకుసంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇదే విభాగంలో భారత షూటింగ్ ద్వయం మను బాకర్-సరబ్‌జోత్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
I love how everyone uses specialized lenses for shooting to avoid blur and increase precision…
But then Turkey sends out a guy who looks like he just picked up the gun for fun and wins silver.
(h/t @paposfut) pic.twitter.com/KXHCHDccpp
— Joe Pompliano (@JoePompliano) July 31, 2024