Jharkhand Teacher: ఆచార్య దేవోభవ అంటూ గురువుకు దేవుడి స్థానాన్ని కల్పిస్తున్న దేశం మనది. ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు.
తన కన్నతల్లిని కుటుంబసభ్యులే కర్రలతో.. ఇటుకలతో కొట్టి చంపినతీరు అందరిని కలిచివేసింది. అమ్మను కొట్టకు అమ్మా.. అంటూ ఆ చిన్నారి ఏడుస్తున్నా కట్నం కోసం వేధించి.. చేసేది ఏమీ లేక ఆమెపై అత్తింటి వారే ఈఘాతుకానికి పాల్పడం సంచలనంగా మారింది. వరకట్నం వేధింపులకు మరో తల్లి బలైంది. ఈ ఘటన పాట్నాలోని ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలిని అబ్దల్ చక్, ఫతుహాలో నివాసం ఉంటున్న సోనమ్ దేవిగా గుర్తించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సోనమ్‌దేవికి…
గతంలో ప్రతి దంపతులు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి దంపతుల ఆలోచన విధానం మార్పులు వచ్చాయి. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు చాలు అనుకుంటున్నారు. కొందరు అయితే ఒకరితోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కుటుంబాల్లో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయితే ఏపీలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఈ విషయం జాతీయ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఏపీలో సగటున ప్రతి 10 కుటుంబాలకు 17…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతికి రానున్నారు. ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయలుదేరతారు సీఎమ్ జగన్. అనంతరం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఎస్వీ యూనివర్శిటీకి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు సీఎం జగన్. అనంతరం 12 గంటలకు సీఎమ్ ప్రసంగం వుంటుంది. ఒంటి గంటకు పద్మావతి పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు భూమి పూజ, శంఖుస్థాపన…
మొదట్లో హడావిడి చేశారు. తర్వాత సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. 15 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే పేరెంట్స్ వారికి వ్యాక్సిన్ ఇప్పించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో 15 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. తెలంగాణలో 15 ఏళ్ళు నుంచి 18 ఏళ్ల వయసు వారు 22 లక్షలకు…
అవసరం కోసం అప్పులు చేయడం సహజం. కానీ ఆ అప్పులే ముప్పుగా పరిణమిస్తే విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫైనాన్సర్ల వేధింపులు తట్టుకోలేక సాయి కృష్ణ(26) అనే యువకుడు మృతి చెందాడు. కరోనా కాలంలో చెల్లించవలసిన ఫైన్…
ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్టు చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం చాలా అధ్వానంగా ఈ సంస్థలు ఉన్నాయని అర్థమవుతోంది. జగిత్యాల జిల్లా బీసీ గురుకులంను చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. జిల్లాలోని కోరుట్ల గురుకులం నుంచి కూడా 380 విద్యార్థులను వారి తల్లిదండ్రలు తీసుకెళ్లారు. ఏం జరిగిందంటే..?ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళనకు…
కరోనా కారణంగా తల్లిదండ్రుల ఆదాయం తగ్గడంతో అప్పటివరకూ ప్రైవేట్ స్కూళ్ళలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించిన వారు సర్కారీ బడుల బాట పట్టారు. చదువు ఎలా వున్నా ఫర్వాలేదు.. ఆర్థిక భారం మోయలేమంటూ వారంతా ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయించారు. అయితే పరిస్థితులు మారాయి. భుత్వ పాఠశాలల నుండి తిరిగి ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థుల వలసలు పెరిగాయంటున్నారు అధికారులు. కరోన కారణంగా లాక్ డౌన్, ఫీజులు కట్టలేక తమ పిల్లలను ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో…