ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువతీ యువకులు. ప్రేమ మత్తులో పడి కన్నవారిని సైతం విడిచి వెళ్లేందుకు వెనకాడడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు ప్రేమ పేరిట దూరమవుతుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి ఒక యువతి అన్ని హద్దులు దాటింది. ఓ తల్లి తన కూతురిని ఆపడానికి ప్రయత్నిస్తూ విలపిస్తోంది. ఆ యువతి తన కుటుంబంతో…
Vizag Road Accident: తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని మసులుకునే పిల్లలు కొందరైతే.. తమనకు ఏది కావాలన్నా మారం చేసి సాధించుకునేవారు మరికొందరు.. ఇంకో వైపు, తన పిల్లల కోసం ఎంత కష్టానైనా భరించి.. వాళ్లకు మెరుగై జీవితాన్ని అందించాలనే భావించే పేరెంట్స్ ఉన్నారు.. తమ జీవితంలో సాదాసీదాగా బతుకుతున్నాం.. మా పిల్లలు అయినా అన్ని చూడాలి అని తాపత్రయ పడే తల్లిదండ్రులు ఉన్నారు.. అయితే, దసరా రోజు 3 లక్షల రూపాయల అప్పు చేసి బైక్…
ప్రస్తుత కాలంలో యువత చిన్న చిన్న విషయాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫోన్ కొనివ్వలేదని, నచ్చిన బైక్, కారు ఇప్పించలేదని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమైనా తట్టుకోలక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. పిల్లలే లోకంగా జీవిస్తున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదని దారుణానికి ఒడిగట్టాడు. వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి…
దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఈమెయిల్ బెదిరింపులు ఎక్కువైపోయాయి. తాజాగా ఢిల్లీలోని 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, ఈ విషయానికి సంబంధించి, రాధికా ప్రాణ స్నేహితురాలు హిమాన్షికా సింగ్ సంచలన విషయాలు బయటపెట్టింది. తన స్నేహితురాలు రాధిక తన కుటుంబం నుంచి అన్ని విషయాల్లో సమస్యల్ని ఎదుర్కొందని, ఆమె తన ఇంట్లోనే ఉక్కిరిబిక్కిరికి గురైందని చెప్పింది.
నవమాసాలు మోసిన తల్లికి బిడ్డలు భారం అవుతున్నారు. కంటికి రెప్పలా కాడాపాల్సిన తండ్రి పిల్లల పోషణ భారం అవుతుందని అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టేస్తున్నారు. వారం వ్యవధిలో ఇద్దరు తల్లులు తమ పిల్లలను 2 లక్షలకు విక్రయించారు. డబ్బుల పంపకాల్లో తేడాతో ఓ కేసు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. స్థానికుల సమాచారంతో మరో పసికందు విక్రయం వెలుగు చూసింది. ఈ రెండు కేసుల్లో 9 మందిని అరెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో…
ఓ ప్రేమజంటకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిదండ్రుల్ని ఎదురించి వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోలీస్ రక్షణను హక్కుగా డిమాండ్ చేయరాదని.. ఒకవేళ నిజమైన బెదిరింపు అయితే పోలీసులు రక్షణ కల్పిస్తారని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
కొన్ని సందర్భాల్లో రీల్ సీన్స్ రియల్ సీన్స్ గా మారినప్పుడు ఆశ్చర్యపోవడం తప్పనిసరి అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. 2014లో 19 ఏళ్ళ వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువకుడు 11 ఏళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాడు. కనిపోయించకుండా పోయిన కుమారుడు తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. 11 ఏళ్ల క్రితం కనిపోయించకుండా పోయిన కుమారుడిని మెదక్ జిల్లా…
అమెరికాలో చావుబతుకల మధ్య కొట్టిమిట్టాడుతున్న భారతీయ విద్యార్థిని నీలం షిండేను కలిసేందుకు తల్లిదండ్రులకు అత్యవసరంగా అమెరికా రాయబార కార్యాలయం వీసా మంజూరు చేసింది. దీంతో నీలం షిండే పేరెంట్స్.. అమెరికా వెళ్లనున్నారు.
కొంత మంది పిల్లలు చదువులో బాగా రానిస్తారు. ఒక్కసారి చదివిన వారు మంచిగా గుర్తుపెట్టుకుని మంచి మంచి ర్యాంకులు సొంతం చేసుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు మాత్రం చదువుల్లో వెనుకబడిపోతారు. ఎన్ని సార్లు చదివిన వారికి గుర్తు ఉండదు. దీంతో ఫెయిల్ అవుతారు. ఈ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.