హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెళ్లికి పెద్దలు నిరాకరించారనీ ఆత్మహత్య యత్నం చేసింది జంట. అయితే ప్రియురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడు గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఒంగోలు కు చెందిన నాగ చైతన్య , కోటి రెడ్డి ప్రేమించుకున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తోంది నాగ చైతన్య. మెడికల్ రెప్రజెంటేటివ్ గా చేస్తున్నాడు కోటి రెడ్డి. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు…
ఆ బుడ్డోడి వయస్సు ఏడాది మాత్రమే.. అప్పుడే నెలకు రూ.75 వేలకు పైగా సంపాదిస్తున్నాడు.. ఇంతకీ.. ఏడాది వయస్సున్న చిన్నాడు.. ఏం చేస్తున్నాడు.. ఎలా సంపాదిస్తున్నాడు అనే ప్రశ్న వెంటనే బుర్రలో మెదిలిందా..? అయితే, ఆ బుడతడు ఇప్పుడు హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా.. షికార్లు చేస్తున్నారు.. విమానంలో ట్రిప్పులు వేస్తూ.. పార్కులు, బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇదేంటి..? తిరిగితే డబ్బులు ఇస్తారా? పైగా అది ఖర్చే కదా? అని మరో ప్రశ్న తలెత్తిందా? విషయం ఏంటంటే..…
చిన్నపిల్లలు అల్లరి చేయడం సహజం. అల్లరి చేసే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. పిల్లల్ని చిన్నతనం నుంచే మంచి దారిలో పెట్టాలి. లేదంటే పెద్దయ్యాక దారితప్పుతారు. పిల్లలు తప్పులు చేసినా, మంచి విజయాలు సాధించినా ఆ క్రెడిట్ మొత్తం తల్లిదండ్రులకు దక్కుతుంది. ఇకపై ఆ దేశంలో పిల్లలు తప్పుచేస్తే దానిక బాధ్యతగా తల్లిదండ్రులకు శిక్ష విధిస్తారట. ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్నది మరెవరో కాదు. చైనా. గత కొంతకాలంగా చైనాలో పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడి…
చైనాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎంత కఠినంగా ఉంటాయో వాటిని అంతే కఠినంగా అమలు చేయటం డ్రాగన్ స్పెషాల్టీ. అలాంటివి ఇప్పటికే అక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటికి మరొకటి జతవుతోంది. చైనాలో వ్యక్తి స్వేచ్చ తక్కువ. కమ్యూనిస్టు పార్టీ అధినాయకుడే దేశాధినేత. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాదాపు అదే ఫైనల్. ఎదిగే పిల్లలకు సంబంధించి ఓ సంస్కరణల చట్టం కోసం ముసాయిదా రెడీ చేసింది. ఇంతకూ అదేమిటంటే “ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా”.…
ఆంధ్ర ప్రదేశ్ కరోనా కారణంగా 6800 మంది చిన్నారులు ఇబ్బందుల్లో పడ్డారని ప్రభుత్వం గుర్తించింది. తల్లి లేదా తండ్రి లేదా ఇద్దర్నీ కొల్పోయిన వారు 6800 మంది చిన్నారులన్నట్టు తెలిపింది. అయితే ఇప్పటివరకు 4033 మంది పిల్లల వివరాలను సేకరించిన ప్రభుత్వం. ఇక అందులో 1659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టుగా గుర్తించిన విద్యాశాఖ… 2150 మంది ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టు గుర్తించింది. మిగిలిన 524 మంది శిశువులుగా పేర్కొంది అయితే కోవిడ్ సమయంలో…
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు నాని. అంతేకాదు దాని తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా లైన్ లో పెట్టాడు. ఇంత బిజీటైమ్ లో కూడా నాని ప్రజల్లో కోవిడ్ అవేర్ నెస్ క్రియేట్ చేయటానికి తాపత్రయపడుతున్నాడు. గతనెలలో కోవిడ్ యుద్ధంలో వీరసైనికుల్లా పోరాడుతున్న డాక్టర్ల కోసం ఓపాటను విడుదల చేసిన నాని ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ పిల్లలను బలంగా తాకుతుందని బలంగా వినిపిస్తున్న తరుణంలో…
ఈ కరోనా కష్ట సమయంలో స్కూలు ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు. ఫీజు కట్టకపోతే ఆన్ లైన్ క్లాస్ లింక్ లు నిలిపివేస్తామని… పై తరగతులకు ప్రమోట్ చేయమని హెచ్చరిస్తున్నాయి. దాంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై డీఈవో కార్యాలయానికి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఫీజులపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కానీ తల్లిదండ్రులపై ఫీజుల విషయంలో ఒత్తిడి చేస్తే స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం అని డీఈఓ లింగారెడ్డి…
సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో నెలక్రితం లాక్‌డౌన్ విధించించింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం కొంత సమయం మినహాయింపు తప్పా.. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇచ్చింది. తాజాగా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతుండడంతో.. లాక్‌డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం. ఆల్ ఓపెన్ అంటూనే.. జులై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం విధి విధానాలను కూడా రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించింది.…
కడప జిల్లా రాయచోటిలో దారుణం చోటు చేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. ప్రేమ వ్యవహారం యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. తాను ప్రేమించిన యువకుడినిపెళ్లి చేసుకుంటానని చెప్పిన సదరు యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేసారు. యువతి ఓ యువకుడిని ప్రేమించగా ఆ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధo చూసి పెళ్లి చేసేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఇదే విషయమై కుటుంబసభ్యులతో వాగ్వాదం…
పిల్లలపై తల్లిదండ్రులు కోప్పడటం సహజమే. తిట్టినపుడు పిల్లలు అలుగుతారు. కొంతమంది పిల్లలు ఇంట్లోనుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోతుంటారు. కానీ, స్పెయిన్ కు చెందిన కాంటో అనే యువకుడు కొంత వినూత్నంగా చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. 2012లో కాంటోని ట్రాక్ సూట్ వేసుకొని బయటకు వెళ్లొద్దని మందలించారని, పెరట్లో గుహ తవ్వడం మొదలు పెట్టాడు. స్కూల్ నుంచి వచ్చిన తరువాత కూడా ఆ గుహను తవ్వడం చేస్తుండేవాడు. కొన్ని రోజుల తరువాత అతనికి తన స్నేహితుడు…