అవసరం కోసం అప్పులు చేయడం సహజం. కానీ ఆ అప్పులే ముప్పుగా పరిణమిస్తే విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫైనాన్సర్ల వేధింపులు తట్టుకోలేక సాయి కృష్ణ(26) అనే యువకుడు మృతి చెందాడు.
కరోనా కాలంలో చెల్లించవలసిన ఫైన్ ను చెల్లించాలి అని సాయి కృష్ణ ను ఒత్తిడి చేశారు ఫైనాన్షర్లు. సాయి కృష్ణ పని చేస్తున్న షాపు కి వచ్చి హోండా యాక్టివా ను తీసుకెళ్ళిపోయారు పైనాన్షయర్లు. సాయి కృష్ణ తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఇప్పుడే కట్టాలి అని వార్నింగ్ ఇచ్చారు. డబ్బులు కడదాం అని చెప్పి ఇంటికి నుండి బయటకు వెళ్లింది సాయి కృష్ణ తల్లి. అవమానం భరించేలక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నాడు సాయి కృష్ణ. ఫైనాన్షర్లు ఇబ్బందులు పెట్టడం వల్లే మా కొడుకు చనిపోయాడు అని సాయి తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు. ఈమధ్యకాలంలో యాప్ ల ద్వారా పర్సనల్ లోన్లు ఇవ్వడం, వారి బంధువుల ఫోన్ కాంటాక్ట్ లు తీసుకుని వేధించడం వల్ల తెలుగు రాష్ట్రాలలో ఈ తరహా ఘోరాలు ఎక్కువైపోయాయి.