Jharkhand Teacher: కీచక టీచరుకు దేహశుద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Teacher: ఆచార్య దేవోభవ అంటూ గురువుకు దేవుడి స్థానాన్ని కల్పిస్తున్న దేశం మనది. ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెచ్చే పనులు చేస్తున్నారు. అలాంటి దిక్కుమాలిన పని చేసిన టీచరుకు స్థానికులు తగిన బుద్ధి చెప్పారు.
పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా పరిధిలోని బరజమ్‌డ లోని ఖాస్జమ్‌డా ప్రభుత్వ అప్‌గ్రేడ్ మిడిల్ స్కూల్‌లో ప్రేమ్ కుమార్ టీచరుగా పనిచేస్తున్నాడు. రోజూ ప్రేమ్ కుమార్ బడికి వచ్చే బాలికలకు అశ్లీల వీడియోలు చూపించేవాడని స్థానిక మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున స్థానిక గ్రామీణ మహిళలు ప్రేమ్ కుమార్ ను పట్టుకున్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థినుల కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది, బరాజ్‌మడ ఆజీవిక మహిళా గ్రామ సంఘంతోపాటు బరాజమడకు చెందిన అనేక మంది మహిళలు.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన ఉపాధ్యాయుడిని మొదట కొట్టారు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ మొఖానికి మసి పూసి, చెప్పుల దండ వేసి బహిరంగంగా ఊరేగించారు. అనంతరం ఉపాధ్యాయుడు ప్రేమ్‌కుమార్‌ను బరాజ్‌మడ ఓపీ పోలీసులకు అప్పగించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రేమ్ కుమార్ బాలికలు టాయిలెట్‌కు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చేవాడంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించే తమని ప్రేమ్ కుమార్ కొట్టేవాడని చెబుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో బస్తీ మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు జమదా బస్తీ నుంచి బరాజ్‌మడకు నడుచుకుంటూ వెళ్తుండగా నిందితుడు ప్రేమ్ కుమార్ ను పట్టుకున్నారు. పాఠశాల నుంచే బూట్ల దండ, చెప్పుల దండ వేసి గ్రామంలోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రేమ్ కుమార్ పై బాధితులు డిప్యూటీ కమిషనర్‌కు లేఖలు అందజేశారు. టీచరును బరాజ్‌మడ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. నిందితుడిని జైలుకు పంపాలని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!