పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని తెలిసి తాను తీవ్ర విచారానికి లోనైనట్టు తెలిపారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తున్న వీరు ప్రమాదవశాత్తు చనిపోవడం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోజూవారీ కూలీపై ఆధారపడి జీవించే వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయాలపాలైన వారికీ మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.