Andhra Pradesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెంటచింతలలో టాటా ఎస్ వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. . మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని తిరిగి పయమనమయ్యారు. కాసేపట్లో ఇంటికి వెళ్లనుండగా ఇంతలోనే మృత్యువు కాటేసింది. రెంటచింతల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగిఉన్న లారీని ఢీకొట్టింది.
Konaseema: అమలాపురంలో మరో వారం పాటు 144 సెక్షన్
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఈ ఘటనలో టాటా ఎస్ వాహనంలోని వారు రోడ్డు మీదకు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డు మొత్తం రక్తసిక్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డవారిని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెంటచింతల ప్రమాద ఘటన బాధితులను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని.. మంత్రి అంబటితో పాటు జిల్లా కలెక్టర్‌కు ప్రమాద ఘటన వివరాలు తెలిపినట్లు ఆయన వివరించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందేలా ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాలకు కారణమైన ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలు పోతున్న పరిస్థితి బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!