పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్యతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆయన కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను శనివారం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి నర్సరావుపేటలో టీడీపీ నేతలు పర్యటించాలని తలపెట్టారు. సోమవారం నాడు వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురంలో టీడీపీ బీసీ నేతలు పర్యటించనున్నారు. ప్రత్యర్థుల చేతిలో హతుడైన జల్లయ్య కుటుంబాన్ని వాళ్లు పరామర్శించనున్నారు.
సోమవారం నాడు వినుకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న టీడీపీ నేతల జాబితాలో కొల్లు రవీంద్ర-పొలిట్ బ్యూరో సభ్యుడు, కొనకళ్ల నారాయణ-పార్లమెంట్ అధ్యక్షుడు, బచ్చుల అర్జునుడు-ఎమ్మెల్సీ, ముద్రబోయిన వెంకటేశ్వరరావు-నియోజకవర్గ ఇంఛార్జ్, పంచుమర్తి అనురాధా-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బుద్దా వెంకన్న-మాజీ ఎమ్మెల్సీ, నాగుల్ మీరా- రాష్ట్ర అధికార ప్రతినిధి, కొనకళ్ల బుల్లయ్య-రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, సాదరబోయిన ఏడుకొండలు-రాష్ట్ర కార్యదర్శి, దొంతు చిన్న-రాష్ట్ర కార్యదర్శి, సాయిన పుష్పవతి- రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు.