Narsaraopet: పల్నాడు జిల్లా ఎఫెక్ట్.. అక్కడ రియల్ బూమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. నర్సరావుపేటలో జిల్లా కార్యాలయాలా ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఇతర జిల్లా శాఖల కార్యాలయాలు కూడా పేటకు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతం మొత్తం హడావుడిగా మారిపోయింది. ఇదే సమయంలో నర్సరావుపేటలో రియల్ బూమ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
కొత్త జిల్లా కేంద్రంగా నర్సరావుపేట మారనుండడంతో ఈ ప్రాంతంలో భూములు కొనేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ భూముల ధరలు రెట్టింపయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతున్న లింగంగుట్ల రోడ్డు, ఉప్పలపాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్లలో భూముల ధరలు రెట్టింపయ్యాయి. ఇక నర్సరావుపేటనుంచి రావిపాడు వెళ్లే రోడ్డు, పాలపాడు రోడ్డు, వినుకొండ రోడ్డులో కూడా ధరలు భారీగానే పెరిగాయి. రియల్ బూమ్ పెరగడంతో వ్యాపారులు కూడా ఇక్కడ కొత్త కొత్త వెంచర్లు మొదలుపెట్టారు. రైతులనుంచి పొలాలు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నర్సరావుపేట చుట్టుపక్కల దాదాపు 100కుపైగా కొత్త వెంచర్లు రావడంతో ఇక్కడ రియల్ బూమ్ ఏర్పడింది.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
మరోవైపు నర్సరావుపేటలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాలవారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా నర్సరావుపేటలో స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లలో స్థలాలు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
గతంలో 20నుంచి 30లక్షలు ఉన్న పొలాల ధరలు ఇప్పుడు ఏకంగా కోటిరూపాయలకు చేరాయి. స్థలాల ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. గతంలో సెంటు స్థలం ధర 4లక్షల వరకూ ఉంటే ప్రస్తుతం 8నుంచి 10 లక్షల వరకూ పలుకుతుందంటున్నారు స్థానికులు. కొత్త జిల్లా ప్రకటన తర్వాత పేటలో స్థలాల ధరలు రెట్టింపయ్యాయంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భూముల ధరలు రెండురెట్లు పెరిగాయి కూడా. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి స్థలాలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుండడంతో భూముల రేట్లు పెరిగాయంటున్నారు స్థానికులు. జిల్లా ఏర్పాటు కాకముందే ధరలు ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తులో పేటలో భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!