Janga Krishnamurthy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. సీట్లు దక్కనివారు, ఆశిస్తున్నవారు పార్టీకి గుడ్‌బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరుతున్నారు. అలాగే కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా టీడీపీలో చేరిపోయారు. తాజాగా వైయస్సార్సీపీ పార్టీ వీడే ఆలోచనలో పల్నాడు జిల్లా ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గురజాల టికెట్ ఆశిస్తున్నారు.
Read Also: Chandrababu: వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు..
అధిష్ఠానం నుంచి ఏవిధమైన స్పందన లేకపోవడంతో పార్టీ మారే ఆలోచనలో ఉన్న ఎమ్మెల్సీ జంగా.కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ తీర్ధం పుచ్చుకొనే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి ఉన్నట్లు సమాచారం. గుంటూరులోని ప్రముఖ హోటల్లో తన ముఖ్య అనుచరులుతో, పార్టీ కార్యకర్తలుతో జంగా కృష్ణమూర్తి కీలక భేటీ నిర్వహించారు. ఈ మధ్య కాలంలో తన కుమారుడు జంగా కోటయ్య పిడుగురాళ్ల జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.