ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆ స్థాయిలో గ్రామంలో దాడులు జరిగాయన్నారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకొని తొండపి గ్రామంలో శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. సీట్ విచారంలో పోలీసులే దోషులుగా తేలుతారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పాత్ర పై దర్యాప్తు చేయాలన్నారు.
READ MORE: Dhanaraj: బాహుబలి వల్ల సర్వం కోల్పోయా.. జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్
టీడీపీ నాయకుల నుంచి డబ్బులు తీసుకున్న పోలీసులు పలనాడు జిల్లాలో సరిగా పనిచేయలేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని సిట్, అధికారులకు వివరించినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు పలు ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారని గుర్తుచేశారు. బీజేపీ, జనసేన, టీడీపీల కూటమి కొంతమంది ప్రభుత్వ అధికారుల మీద ఫిర్యాదులు చేశారన్నారు.ఎక్కడైతే కూటమి సభ్యులు ఫిర్యాదులు చేసి అధికారులను తప్పించారో, అక్కడే హింస చెలరేగిందన్నారు. గత రెండు ఎన్నికలలో జరగని హింస ఇప్పుడు జరిగిందని తెలిపారు. కొత్తగా ఎస్పీని పంపిస్తే సరిగ్గా పనిచేయలేకపోయారని చెప్పారు. మార్పులు చేర్పుల వల్లే ఈ కుట్ర జరిగిందా, లేక చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ కలిసి కుట్ర చేశారా? అని ప్రశ్నించారు. కూటమి నాయకులు, నకిలీ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకొని గెలవాలని చూశారన్నారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేశారని చెప్పారు. నా అల్లుడు కారు పగలగొట్టారని చెప్పారు. కేసు పెడితే పోలీసులు పట్టించుకోలేదని.. ఫిర్యాదు చేస్తే ఘటన స్థలానికి రాలేదని పోలీసులపై మండిపడ్డారు.