Tipper Collided Private Travel Bus In Chilakaluripet: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓటు వేసి తిరిగి వస్తుండగా బస్సు – టిప్పర్ ఢీ కొట్టడంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా చిన్నాగంజం నుంచి హైదరాబాదుకు బయలు దేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, చిలకలూరిపేట మండలం ఈవూరి వారి పాలెం డొంక సమీపంలో ఒక టిప్పర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు – టిప్పర్ ఢీ కొవడంతో అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ తో పాటు మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు సజీవదహనం అయ్యారని పేర్కొన్నారు.
Read Also: Ravi Shastri: కాలంతో పాటు మారాలి.. ఆ నిబంధన మంచిదే!
కాగా, ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో నలుగురు బాపట్ల జిల్లా చిన్న గంజం మండలం నీలాయిపాలెం వాసులుగా గుర్తించారు.. వీరందరూ ఓటు హక్కు వినియోగించుకొని హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం మరో 32 మందికి తీవ్ర గాయాలు కావటంతో వారిని చిలకలూరి పేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
Read Also: Sharathulu Varthisthai OTT: ఓటీటీలోకి మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడిన వారిని పోలీసులు తీసుకు వచ్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఎన్టీవీతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాజ్యలక్ష్మి, సాయి కుమార్ మాట్లాడుతూ.. నిద్రమత్తులో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది అని చెప్పారు. వెంటనే డ్రైవర్ సీటు పక్కన ఉన్న ఎగ్జిట్ డోర్ ద్వారా బయటకు వచ్చామన్నారు. క్షణాల్లోనే బస్సులో మంటలు అంటుకున్నాయి.. కొంత మంది బస్సు అద్దాలు పగలకొట్టి బయటకు వచ్చారు.. కొందరికి బస్సులో మంటలు వ్యాపించడంతో బయటకు రావటం సాధ్యం కాలేదు.. అర్థరాత్రి దాటిన తర్వాత గంట సమయంలో ప్రమాదం జరిగింది.. 108కి ఫోన్ చేస్తే వాళ్ళు, స్థానికులు వచ్చి సాయం చేశారు.. హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేసి తిరిగి హైద్రాబాద్ వెళ్తుండగా ఇలా జరిగింది అని బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులు చెప్పారు.
మృతుల వివరాలు:-
1. అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా.
2. ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
3. ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
4. ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
5. చిలకలూరి పేట ప్రమాద ఘటనలో మత్యు వాత పడ్డ టిప్పర్ డ్రైవర్ మధ్యప్రదేశ్ కు చెందిన హరిసింగ్ గా గుర్తింపు.
6. మరోకరి వివరాలు తెలియ రాలేదు.