AP Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇయర్ ఎండ్‌లో ఒకరోజు ముందుగానే పెన్షన్‌దారులకు డబ్బులు అందబోతున్నాయి.. పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది… డిసెంబర్ 31వ తేదీ సంవత్సర చివరలో , పెన్షన్ పండుగలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాస్తవానికి 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, లబ్ధి దారులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది.. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది..
Read Also: Magnus Carlsen: విశ్వనాథన్ ఆనంద్ అనర్హుడు.. కార్ల్‌సన్ తీవ్ర విమర్శలు!
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావులు పర్యవేక్షించారు.. సీఎం చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి నివాసం నుండి పల్నాడు జిల్లాకు బయలుదేరుతారు.. 10:50 గంటలకు నరసరావుపేట మండలం యలమంద గ్రామానికి చేరుకుంటారు.. అనంతరం 11 గంటల నుంచి 11:30 వరకు లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేస్తారు.. ఉదయం 11:35 నుండి మధ్యాహ్నం 12:35 వరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు..
Read Also: Syria-Ukraine: సిరియాతో ఉక్రెయిన్ దోస్త్!.. చర్చలు జరిగినట్లుగా కథనాలు
ఆ తర్వాత మధ్యాహ్నం 12:40కి పలనాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు.. అనంతరం ఒంటిగంట 45 నిమిషాలకు ,కోటప్పకొండ లోని త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు ముఖ్యమంత్రి … ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అటు కట్టుదిట్టమైన భద్రతతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. మరో వైపు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్షన్లు అందుకుంటున్న వారికి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. యలమంద గ్రామానికి చెందిన తలారి సారమ్మ ,ఏడుకొండలు సీఎం చేతుల మీదుగా పెన్షన్ అందుకోనున్నారు… తలారి శారమ్మ, భర్త 2021 లో , కరోనాతో మృతి చెందాడు.. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఆమె భర్త నాగరాజు చనిపోవడంతో, సారమ్మ వితంతు పింఛన్ అందుకుంటున్నారు.. అదేవిధంగా మరొక లబ్ధిదారుడు ఏడుకొండలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా, వృద్ధాప్య పెన్షన్ అందుకుంటున్నారు.. తమ ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారన్న ఆనందంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..