పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలవ కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో మధిర సామ్రాజ్యం (50 ) మధిర గంగమ్మ (55 ), చక్కెర మాధవి( 30) తేనెపల్లి పద్మావతి (45 )అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
READ MORE: Minister Seethakka: మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. భక్తులకు ఇబ్బంది కలగొద్దని ఆదేశం
కాగా.. ఈ ఘటనపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.