పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు దేశంలో అమ్మాయిల పెళ్లిళ్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నవయస్సులోనే అమ్మాయిలకు వివాహం చేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, నగదు కొరత ఉన్న పాకిస్తానీ తల్లిదండ్రులు డబ్బుకు బదులుగా తమ తక్కువ వయస్సు గల కుమార్తెలను వివాహం కోసం వ్యాపారం చేస్తున్నారు.
Pakistan: మైనారిటీ హక్కులపై పాఠాలు చెప్పాలనుకునే దాయాది దేశం పాకిస్తాన్, తన దేశంలో జరుగుతున్న మైనారిటీ అణిచివేతను పట్టించుకోవడం లేదు. పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్‌లో మైనారిటీల హక్కులు ఉల్లంఘన జరుగుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది.
August 15: ఆగస్టు 15, భారతదేశానికి బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం లభించిన తేదీ. ఎన్నో ఉద్యమాల తర్వాత 1947 ఇదే తేదీన మన భారతీయ పతాకం సగౌరవంగా రెపరెపలాడింది. ఈ తేదీ ఒక్క మనదేశానికే కాకుండా ఉపఖండంలోని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా ప్రముఖమైన తేదీగా ఉంది.
Pakistan : క్రూరత్వానికి కులం మతం దేశం లేదు. మహిళలు, బాలికలపై దారుణాలు ఏ దేశంలోనైనా, ఎప్పుడైనా జరగవచ్చు. పొరుగు దేశం పాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది.
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘోరం జరిగింది. వేదికపై ఉన్న మహిళా టిక్‌టాకర్ పట్ల యువకులు నీచానికి ఒడిగట్టారు. పట్టపగలే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇష్టానుసారంగా చేతులు వేసి.. వస్త్రాలు చింపి వివస్త్రను చేసి బలత్కారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Triple Talaq: రాజస్థాన్‌కి చెందిన వ్యక్తి పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకునేందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. కువైట్‌లో నుంచి అతను భార్యకు ఫోన్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు 35 ఏళ్ల వ్యక్తిని జైపూర్ విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
Indian Air Force : చైనా, పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుండి 31 రిమోట్‌తో నడిచే సాయుధ MQ-9B 'హంటర్-కిల్లర్' విమానాల కొనుగోలు కోసం భారతదేశం వేగంగా చర్చలు జరుపుతోంది.
Pakistan : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో మంగళవారం ఖురాన్ పేజీలను తగులబెట్టినందుకు ఇద్దరు ముస్లిం మహిళలపై దైవదూషణ కేసు నమోదైంది. కసూర్ జిల్లా రాయ్ కలాన్ గ్రామంలో స్థానిక ఇమామ్ కాషిఫ్ అలీ ఫిర్యాదు చేశారు.
Arshad Nadeem: పాకిస్తాన్, అక్కడి ప్రజల్ని ఉగ్రవాదులతో విడదీసి చూడలేం. అక్కడి వారిలో ఉగ్రవాదం అంతగా పెనవేసుకుపోయింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాకిస్తాన్‌కి చెందిన అర్షద్ నదీప్ జావెలన్ త్రోలో ఏకంగా స్వర్ణం గెలిచాడు. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చాడు.
Arshad Nadeem: అర్షద్ నదీమ్.. ఇప్పుడు ఈ పేరు పాకిస్తాన్లో సంచలనంగా మారింది. మన ఇండియా కూడా ఫేమస్ అయ్యాడు. పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్లో ఏకంగా స్వర్ణం సాధించాడు.