Maharashtra Navnirman Sena: పదేళ్ల తర్వాత భారత్‌లో పాకిస్థాన్ సినిమా.. తన్నులు తప్పవు!
- పాకిస్థానీ నటులు ఫవాద్ ఖాన్.. మహిరా ఖాన్‌లు నటించిన చిత్రం
- త్వరలో భారత్ లో విడుదల కానున్నట్లు ప్రకటన
- తన్నులు తప్పవన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థానీ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్‌లు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ త్వరలో భారతదేశంలో విడుదల కానుందని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) మరోసారి పాకిస్థానీ కళాకారులు, చిత్రాలకు వ్యతిరేకంగా ముందుకొచ్చింది. పాకిస్థానీ సినిమాను భారతదేశంలో విడుదల చేయడానికి అనుమతించబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత అమయ్ ఖోప్కర్ స్పష్టం చేశారు. అంతేకాదు పాకిస్థానీ నటులెవరైనా భారత్‌కు వస్తే కొడతామని హెచ్చరించారు.
READ MORE: Israel-Hamas war: గాజా ఆశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృతి
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అమయ్ ఖోప్కర్ ఓ ఇంటర్వ్యూలో పాకిస్థాన్ నుంచి వచ్చిన కళాకారులపై మాట్లాడుతూ.. “మన దేశంపై పాకిస్థాన్ నిరంతరం దాడులు చేస్తోంది. గత వారం కూడా మన సైనికులు వీరమరణం పొందిన దాడులు జరిగాయి. మన దేశంలోని అనేక నగరాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. మన దేశ సైనికులు అమరులయ్యారు. అటువంటి పరిస్థితిలో పాకిస్థాన్ నుంచి మనకు కళాకారులు ఎందుకు అవసరం? మన దేశంలో కళాకారులు లేరా? ఇక్కడ సినిమాలు చేయలేదా? ముంబయిలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారుల ఇళ్లలో టీవీని ఆన్ చేసినప్పుడు… వారు ఈ పాకిస్థానీ కళాకారుల ప్రదర్శనలను చూస్తారా? వారి కళాకారులు మాకు వద్దు. పాకిస్థాన్‌కు చెందిన ఏ ఆర్టిస్ట్‌ని లేదా సినిమాను ఇక్కడ విడుదల చేయడానికి మేము అనుమతించం. ఇతర రాష్ట్రాలు కూడా తమ నగరాల్లో పాకిస్థానీ చిత్రకారుడు లేదా సినిమా విడుదల చేయకూడదని నేను చెబుతున్నాను. తప్పకుండా నిరసన తెలుపుతాం. ” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE:Indus Water Treaty: మోడీ మాస్టర్ స్ట్రోక్.. ఇదే జరిగితే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం..
పాకిస్థానీ నటులతో పాటు బాలీవుడ్ తారలను కూడా అమయ్ ఖోప్కర్ విమర్శించారు. పాకిస్థానీ కళాకారులతో కలిసి పనిచేయడానికి మద్దతిచ్చే బాలీవుడ్ ప్రముఖులకు ఆయన సందేశం ఇచ్చారు. “బాలీవుడ్ నిర్మాతలు సిగ్గుపడాలి” అని అన్నారు. మన దేశంలో చాలా టాలెంట్ ఉంది. అలాంటప్పుడు బయటి నుంచి.. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి కళాకారులను తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? మీరు ఎంత ప్రయత్నించినా పాకిస్థానీ ఆర్టిస్టులెవరూ ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు ఇవ్వడానికి లేదా సినిమాలను ప్రదర్శించడానికి అనుమతించం. ప్రస్తుతం పాకిస్థానీ కళాకారులు ఇక్కడికి వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేస్తారనే చర్చలు జరుగుతున్నాయి. ఆ తరహాలో అస్సలు ఆలోచించవద్దని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. ప్రమోషన్ గురించి ఆలోచించకండి. లేకపోతే దెబ్బలు తింటారు. చేతులు, కాళ్లు విరిగిపోతాయి అని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!