కాశ్మీర్‌లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మద్దతు ఇవ్వడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాకిస్థాన్ ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ కూటమి స్టాండ్‌తో తాము ఏకీభవిస్తున్నామని ప్రకటించారు.
READ MORE: Rajasthan: సర్జరీ విఫలమై ఆర్‌ఏఎస్ అధికారి ప్రియాంక హఠాన్మరణం.. విచారణకు ఆదేశం
నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల్లో తాము గెలిస్తే 35ఏ, 370పై సస్పెన్షన్ ఎత్తేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ అంశంపై పాక్ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని.. ఇది సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ రెండూ జమ్మూకశ్మీర్ లో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నాయన్నారు. ఈ సమస్యపై, కాశ్మీర్ ప్రజలు కూడా చాలా చైతన్యవంతులయ్యారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. హోదా పునరుద్ధరిస్తే, కాశ్మీరీ ప్రజలు పడిన గాయాలు కొంతైనా నయం అవుతాయన్నారు.
READ MORE: LG VK Saxena: ఢిల్లీలో లక్షలాది మంది నరకం అనుభవిస్తున్నారు.. ముందు వీటిపై దృష్టి పెట్టండి
ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్‌పై దాడి చేయడానికి బీజేపీకి కొత్త ఆయుధాన్ని ఇచ్చింది. భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని బీజేపీ నేత అమిత్ మలవీత్ అన్నారు. ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్… కాశ్మీర్‌పై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరికి మద్దతిస్తోందని మండిపడ్డారు.
READ MORE:Neha Sharma Bikini: వామ్మో నేహా శర్మ.. బికినిలో రోడ్స్ మీద షికార్లు!
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ అంశంపై మండిపడ్డారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. అమిత్ షా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అందులో.. కాంగ్రెస్, పాకిస్థాన్‌ల ఉద్దేశాలు, ఎజెండా ఒక్కటేనని పేర్కొన్నారు. “ఆర్టికల్ 370, 35ఏ పై కాంగ్రెస్, జెకేఎన్‌సీకి పాకిస్థాన్ రక్షణ మంత్రి మద్దతు ఇవ్వడం మరోసారి కాంగ్రెస్‌ను బట్టబయలు చేసింది. కాంగ్రెస్, పాకిస్థాన్ ఉద్దేశాలు, ఎజెండా ఒక్కటేనని ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ దేశప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తున్నారు.” అని రాసుకొచ్చారు.