Jaish-e-Mohammed Chief Family Dead: బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు నిర్వహించాయి. ఇక, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరిపిన దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్‌ల స్థావరాలపై క్షిపణి దాడుల చేసింది భారత వైమానిక దళాలు. కాగా, పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్ లోపల ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది, అతని సోదరితో సహా మరణించారు.
Read Also: Amit Shah: సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి.. ఆర్మీకి అమిత్ షా ఆదేశాలు..
అయితే, భారత సైన్యం జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు సహా మరో నలుగురు సహాయకులు మరణించారని జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ చెప్పారని బీబీసీ ఉర్దూ కథనాలు ప్రచురించింది. ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్, లష్కరే-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున 1.05 గంటలకు భారత్ దాడి చేసింది. కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్ లోయలో టూరిస్టులను చంపేయడంతో భారతదేశం ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ సిందూర్’న నిర్వహించింది.