ఇండియాకు ఇజ్రాయెల్ బాసట.. దాడులు కొనసాగించాలని సూచన!
పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులకు దిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదులను నాశనం చేసేందుకు భారత్ ఇలాగే దాడులు కొనసాగించాలని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ వేదిగా పోస్ట్ చేశారు. ఇండియా ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసింది.. వారికి మేము అండగా ఉంటామని పేర్కొన్నారు. అమాయకులపై టూరిస్టులపై ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ రాయబారి సూచించారు.
పాకిస్తాన్‌లో భారత వైమానిక మొదటి దాడి జరిగింది అక్కడే..
పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపి కుటుంబాల్లో శోకాన్ని నింపిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రెడీ అయ్యింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత దళాలు వైమానిక దాడులు నిర్వహించి తిరిగి వచ్చాయి. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ప్రకటించాయి. అయితే పాకిస్తాన్‌లో భారత వైమానిక మొదటి దాడి జరిగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మురిడ్కేలోని హఫీజ్ సయీద్‌తో సంబంధం ఉన్న మసీదుపై మొదటి దాడి జరిగింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామగ్రితో రాఫెల్ జెట్‌లను ఉపయోగించారు. శ్రీనగర్ సమీపంలోని పాంపూర్‌లో పాకిస్తాన్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఆపరేషన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళం సమన్వయంతో జరిగాయి.
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 22 మంది మావోయిస్టులు మృతి
బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట కొండలలో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ‘ఆపరేషన్ కగార్’గా కొనసాగుతున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా CRPF యూనిట్లు, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని గుట్టల మధ్య లోతైన అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, ముఖ్యంగా హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవడం. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టుల ఉనికి ఉందన్న బలమైన సమాచారం మేరకు ముందుచూపుతో ఆపరేషన్ సాగుతోంది.
ఉలిక్కపడ్డ పాతబస్తీ.. చంద్రయాణగుట్ట హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రయాణగుట్ట నియోజకవర్గం, బండ్లగూడ మండలం పరిధిలో హైడ్రా విభాగం అక్రమ కబ్జాదారులపై విరుచుకుపడింది. అక్బర్ నగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 303 నుంచి 306 వరకూ ఉన్న ప్రభుత్వ భూమిలో 2000 గజాల మేర కబ్జా చేసిన స్థలాన్ని గుర్తించిన హైడ్రా బృందం, అక్కడ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసింది. ఇటీవల కాలంగా చెరువులు, ప్రభుత్వ భూములపై జరిగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీవ్రంగా ఫోకస్ చేస్తోంది. ఈ చర్యలతో కబ్జా రాయుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా పలువురు MIM కార్పొరేటర్లు, మహిళా నాయకులు హైడ్రా అధికారులపై నిరసన చేపట్టారు.
పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత సైన్యం నిన్న రాత్రి పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో సైన్యం నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి మిస్రీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అర్థరాత్రి 1. 05 నుంచి 1. 30 మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగింది.. పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టాం..
పాకిస్తాన్పై భారత్ దాడులను తప్పుబట్టిన చైనా!
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశానికి చెందిన సైన్యం జరిపిన దాడులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దాయాది దేశంపై ఇండియా దాడి చేయడం విచారకరం అని అభివర్ణించారు. ఈ పరిస్థితి గురించి మేము ఆందోళన చెందుతున్నామన్నారు. ఇక, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలని మేము రెండు దేశాలను కోరుతున్నామని తెలిపారు. భారత్ తక్షణమే “ఆపరేషన్ సింధూర్” ను నిలిపి వేయాలని బీజింగ్ ప్రతినిధి కోరారు. అయితే, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకుల హత్యకు ప్రతీకారంగా భారత్ ఉగ్ర స్థావరాలపై దాడులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడిన ఉగ్రవాద సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌ల స్థావరాలపై క్షిపణి దాడుల చేసింది భారత వైమానిక దళాలు. 26/11 ముంబై దాడులతో సంబంధం ఉన్న లష్కరే తోయిబా శిక్షణా శిబిరాలు (అజ్మల్ కసబ్ శిక్షణతో సహా), మురిద్కే (పాకిస్తాన్ పంజాబ్) ప్రధాన కార్యాలయంపై కూడా దాడులు చేసినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. కాగా, పాకిస్తాన్ సరిహద్దు వెంబడి అన్ని వైమానిక రక్షణ విభాగాలను అప్రమత్తం చేసినట్లు భారత సైనిక దళం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పై ముందస్తుగా అమెరికా, రష్యా, యుకే, యూఏఈ, సౌదీ అరేబియాతో సహా అనేక ప్రముఖ దేశాలను దాడుల గురించి వివరించింది భారతదేశం.
ఆపరేషన్ సింధూర్ పై సినీ తారల ఎమోషనల్ ట్వీట్స్
భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌లో లోని ఉగ్ర శిబిరాలపై దళాల దాడులు చేసింది. పీఓకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసి మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇండియాన్ ఆర్మీకి అభినందలు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు నెటిజన్స్. అలాగే పలువురు సినీ తారలు సైతం భారత ఆర్మీకి సెల్యూట్ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..
25 నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్..
కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ.. మే 6, 7 తేదీలలో భారత సైన్యం జైషే, హిజ్బుల్ స్థావరాలను ఎలా ధ్వంసం చేసిందో ఆయన వివరించారు. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను సృష్టిస్తున్నారని కల్నల్ సోఫియా అన్నారు. పాకిస్తాన్, పీఓకేలలో తొమ్మిది లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేసాము. లాంచ్‌ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను లక్ష్యంగా దాడులు జరిపామని అన్నారు. 25 నిమిషాల పాటు ఆపరేషన్ సింధూర్ జరిగింది.. పౌరులు లేని ప్రాంతాల్లోనే టార్గెట్ చేశాం.. పీవోకే, పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాం.. కచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతోనే దాడులు చేశామన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లో మొదటి లష్కర్ శిక్షణా కేంద్రం సవాయి నాలా ముజఫరాబాద్‌లో ఉందని సోఫియా, వ్యోమిక విలేకరుల సమావేశంలో తెలిపారు. సోనామార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందారు. ఈ శిక్షణా కేంద్రాన్ని సైన్యం ధ్వంసం చేసిందని అన్నారు.
హైదరాబాద్‌కు చేరుకున్న 51 దేశాల అందగత్తెలు
ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు హోస్టింగ్ చేసే అరుదైన గౌరవాన్ని పొందిన హైదరాబాద్ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే 51 దేశాలకు చెందిన అందాల ప్రదినిధులు నగరానికి చేరుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల కంటెస్టెంట్లు ఎయిర్ పోర్టులో అడుగుపెడుతున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా సాంప్రదాయ వస్త్రధారణతో, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలుకుతోంది. ఆతిథ్య పరంగా రాష్ట్రం తన విస్తృతతను చాటుతోంది.
సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించండి.. ఆర్మీకి అమిత్ షా ఆదేశాలు..
పహల్గాం ఉగ్ర దాడికి భారత బలగాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట తొమ్మిది ఉగ్ర స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారు జామున విరుచుకుపడ్డాయి. ఈ దాడి తర్వాత కూడా పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో సుమారు పది మంది భారతీయ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తుంది. అలాగే, పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ బలగాలకు కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.