ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన భారత ఆర్మీ.. పాక్ పై మెరుపుదాడులు..
భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇప్పటి వరకు భారత ఆర్మీ ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. కాగా, ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆర్మీ దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. అయితే, అర్థరాత్రి 1.44 గంటలకి దాడులు ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా భారత సైన్యం ఓ పోస్ట్ పెట్టింది.
భారత్ మెరుపు దాడులు.. బిత్తరపోయిన పాక్ ప్రధాని
భారత్ దాడులను పాకిస్తాన్ సైన్యం ధ్రువీకరించింది. పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ రియాక్ట్ అయ్యారు. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ఏరియాల్లో ఈ దాడులు కొనసాగినట్లు పేర్కొనింది. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోగా, 12 మంది తీవ్రంగా గాయపడినట్లు పాక్ ఆర్మీ తెలిపింది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే, భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని పాక్ డీజీ ఐఎస్‌పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ అన్నారు.
పాకిస్తాన్ కాల్పుల్లో ముగ్గురు భారతీయ పౌరులు మృతి..
పహల్గాం ఉగ్ర దాడికి బదులుగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటల సమయంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులను ప్రారంభించింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. దీంతో సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంట పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు మృతి చెందారు. అమాయక ప్రజలను పాక్ బలి తీసుకుందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దీనికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది.
ఉగ్ర శిబిరాలపై భారత దళాల దాడులు.. విమానాల రాకపోకలు రద్దు
పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారత్ నినదించిన వేళ భారత్ పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పలు విమానాల రాకపోకలు రద్దయ్యాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడుల నేపథ్యంలో మే 7న మధ్యాహ్నం 12 గంటల వరకు జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేశారు.
‘కాంత’ నుండి భాగ్యశ్రీ బోర్సే అదిపోయే లుక్..
రవితేజ కు జోడిగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే. ఈ మూవీ భారీ డిజాస్టర్ అయినా అమ్మడు మాత్రం ఓవర్‌నైట్ స్టార్ అయింది. ఒక్కసారిగా వరుస అవకాశాలు తలుపుతట్టడంతో క్షణం తీరిక లేకుండా కెరీర్ బిజీగా మారింది. ఇప్పటి వరకు చేసింది ఒక్క సినిమానే అయినా ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘కింగ్డమ్’ చిత్రంలో నటిస్తుండగా, రామ్ తో #RAPO22, దుల్కర్ సల్మాన్ తో ‘కాంత’ సినిమాలతో బిజీగా ఉంది. మరో రెండు చిత్రాలు లైన్‌లో ఉన్నాయట. అయితే మంగళవారం మే6న భాగ్య శ్రీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయా చిత్రాల మేకర్స్ భాగ్యశ్రీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే భారత్ లక్ష్యం..
హల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మంగళవారం రాత్రి పాకిస్తాన్ పై భారత్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీనికి భారత సైన్యం దీనికి ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టింది. ఈ దాడులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. భారతదేశం ఈ ప్రతీకార చర్యల్లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు అన్నారు. భారత్ పై దాడులు జరపడానికి ప్లాన్ చేసిన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే ఈ దాడుల లక్ష్యం అని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
ఆపరేషన్ సింధూర్.. ఆ పేరులోనే మొత్తం సందేశం..!
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌పై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు ఇండియన్ సైన్యం ప్రకటించింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతోనే పాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందంటున్నారు. అయితే, ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరెందుకు పెట్టారనే విషయంపై ఒక థియరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గామ్ లో భార్యల కళ్ల ముందే భర్తలను చంపి ఉగ్రవాదులు మన ఆడబిడ్డల నుదటిన సింధూరాన్నితుడిచి వేశారు. దానికి ప్రతికారమే ఈ దాడి అన్న అర్థంలో సింధూర్ అని త్రివిధ దళాలు పేరు పెట్టాయని ప్రచారం జరుగుతుంది.
ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి.. 80 మందికి పైగా టెర్రరిస్టులు హతం..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో భారత్ తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది భారత్ సైన్యం.
ప్రధాని మోడీ పర్యవేక్షణలోనే ఆపరేషన్ సింధూర్..
పాకిస్తాన్ పై దాడులు తప్పవని ఇండియన్ గవర్నమెంట్ గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది. దీనికి పాకిస్తాన్ సైన్యం కూడా స్పందించింది. భారత దాడులు అనంతరం సరిహద్దుల వెంబడి కాల్పులకు దిగింది. ఈ కాల్పులకు భారత ఆర్మీ కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మరో వైపు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైతుంది వాయు రక్షణ వ్యవస్థ.
ఆపరేషన్ సిందూర్ పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్, మర్కజ్ తైబా, మురిద్కే, సర్జల్ / టెహ్రా కలాన్, మెహమూనా జోయా ఫెసిలిటీ, సియాల్‌కోట్, మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, భీంబర్, మర్కజ్ అబ్బాస్, కోట్లి, మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్‌లోని షావాయి నల్లా క్యామ్, మర్కజ్ సయ్యద్నా బిలాల్ లో మెరుపు దాడులు చేసింది. భారత్ చేపట్టిన ఈ ప్రతీకార చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టారు. పాక్ పై భారత్ వైమానిక దాడులపై అసదుద్దిన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.