Terror Sites: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉగ్రస్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ దాడులు చేసింది. అయితే, ఆపరేషన్ సింధూర్ కేవలం అర్థరాత్రి 1.05 నుంచి 1.30 వరకు అంటే.. కేవలం 25 నిమిషాల్లోనే పూర్తి చేసినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో 9 చోట్ల 21 లక్ష్యాలపై దాడి జరిగిందన్నారు.
పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఇవే..
* మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్
* మర్కజ్ తైబా, మురిడ్కే
* మర్కజ్ అబ్బాస్, కోట్లి
* మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి
* ముజఫరాబాద్‌లోని షావాయి నల్లా క్యాంపు
* మర్కజ్ సయ్యద్నా బిలాల్
* సర్జల్/తెహ్రా కలాన్
* మహ్మూనా జోయా సెంటర్, సియాల్‌కోట్
* మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా