ఈరోజు నుంచి న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. కాగా, ఈ సదస్సు జరిగే సమయంలోనే సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కావాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తాలిబన్లను కూడా పిలవాలని పాక్ కొత్త మెలిక పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న ప్రస్తుత…
అసలే పాక్ క్రికెట్ బోర్డు నష్టాల్లో మునిగిపోయింది. ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పర్యటనకు వచ్చి చివరి నిమిషంలో పర్యటను క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో పాక్ క్రికెట్ కు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బందోబస్తు కోసం 500 మంది పోలీసులను ఏర్పాటు చేసింది. అంతేకాదు, బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. వీరందరిని న్యూజిలాండ్ జట్టు బస చేస్తున్న హోటల్స్ వద్ద బందోబస్తుకు ఏర్పాటు…
పాకిస్తాన్లో హిందువులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో నియామకం కావడం అంటే అంతటి సుళువైన విషయం కాదు. అడుగడుగున ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాంటి సాహసం చేసి చరిత్ర సృష్టించింది సనా రాంచంద్ గుల్వానీ. పాకిస్తాన్‌లోని అత్యున్నత ఉద్యోగమైన అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్‌కు ఎంపికైంది. దీనికోసం జరిగిన పరీక్షల్లో మొదటిసారికే విజయం సాధించింది సనా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు అడుగువేయగలినపుడే తప్పకుండా అనుకున్న లక్ష్యాలను…
వచ్చే నెల తమ జట్ల పాక్ పర్యటన ఆలోచన విరమించుకుంది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు – ECB. అక్టోబర్ 13, 14 తేదీల్లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు రావల్పిండిలో T-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. T-20 వరల్డ్ కప్‌కు ఇవి సన్నాహకాలుగా ఉపయోగపడతాయని భావించింది ECB. అలాగే, అక్టోబర్ 17, 19, 21 తేదీల్లో ఇంగ్లాండ్ మహిళల జట్టు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ, ఇప్పుడు నిర్ధిష్టమైన ముప్పు పొంచి…
ఆమెరికాపై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ నిందలు వేస్తున్నదని ఆరోపించారు. 2001లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసిన సమయంలో పాకిస్తాన్లో రాజకీయ సుస్థిరత లేదని, జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు చేసి పాలన చేజిక్కించుకున్నారని, ముషారఫ్‌కు అమెరికా మద్ధతు అవసరమవడంతో ఆఫ్ఘన్లో యుద్ధానికి మద్ధతు పలికారని, ఇది తప్పుడు నిర్ణయం అని పాక్ పీఎం పేర్కొన్నారు. అయితే, విదేశీదళాలకు వ్యతిరేకంగా వారికి శిక్షణ ఇచ్చామని, అమెరికాకు వ్యతిరేకంగా…
న్యూజిలాండ్, పాక్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన టూర్ పూర్తి గా రద్దైంది. ఇవాళ పాక్ లోని రావల్పిండి స్టేడియం లో మొదటి వన్డే.. ఇవాళ రద్దు అయింది. భద్రతా సమస్యల కారణంగా ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ రద్దు అయింది. అయితే.. మొదటి మ్యాచ్ రద్దు అయినట్లు ప్రకటించిన కొద్ది సేపటి క్రితమే.. పాక్ టూర్ ను కూడా పూర్తి గా రద్దు చేసుకుంటున్నట్లు.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. భద్రతా సమస్యల…
వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో దాదాపు అన్ని క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇక ఏ మధ్యే పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. కానీ అదే సమయంలో ఆ జట్టు హెడ్ కోచ్ అయిన మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్…
టీ20 వరల్డ్ కప్ 2021 వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్ లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇక తాజాగా పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే…
అఫ్షనిస్తాన్ దేశం మొత్తం తాలిబన్ల వశం కాకుండా ఆపుతున్నది ఏదైనా ఉందంటే అది పంజ్ షీర్ మాత్రమే. ఇప్పటికే అప్ఘనిస్తాన్ అంతటినీ ఆక్రమించిన తాలిబన్లు పంజ్ షీర్ ను మాత్రం హస్తగతం చేసుకోలేకపోయారు. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య పంజ్ షేర్లో భీకరపోరు నడుస్తోంది. అయితే పంజ్ షేర్ ను తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటిస్తుండగా.. అదేమీ లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా తాలిబన్లను తమ…
పాకిస్థాన్‌లో మరోసారి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు.. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇవాళ ఆత్మాహుతి దాడి జరిగింది… ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రగాయాలపాలైన స్థానిక మీడియా పేర్కొంది… ఇక, ఈ దాడి తమపనేనంటూ తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.. ఆత్మాహుతి దాడిపై మీడియాతో మాట్లాడిన క్వెట్టా డిప్యూటీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ అజహర్ అక్రమ్.. క్వెట్టాలోని మస్టుంగ్ రోడ్డులో ఉన్న ఫ్రాంటియర్ కార్ప్స్ చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి జరిగిందని.. దాడిలో…