ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పాకిస్తాన్ దేశం ఒక్కటే కాబూల్‌కు విమానాలు నడుపుతున్నది. కాబూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ విమానాలు కొన్ని పాక్‌కు నడుస్తున్నాయి. అయితే, కాబూల్ ఎయిర్ పోర్ట్ తిరిగి ఒపెన్ అయ్యాక విమాన సర్వీసులపై తాలిబన్ల జోక్యం అధికం అయింది. ఈ జోక్యం కారణంగా విమాన టికెట్ల ధరలను విపరీతంగా పెంచారు. కాబూల్ నుంచి ఇస్లామాబాద్‌కు టికెట్ ధరను ఏకంగా 2500 డాలర్లకు పెంచారు. గతంలో టికెట్ ధర 120 నుంచి 150 డాలర్ల మధ్యలో ఉండేది.…
భారత్-పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయుధాల తరలింపు, అక్రమ చొరబాట్లు, చివరకు డ్రోన్ల ద్వారా దాడులకు సైతం పూనుకుంటుంది పాకిస్థాన్.. అయితే, భారత సైన్యం ఎప్పటికప్పుడూ వాటిని తిప్పికొడుతూనే ఉంది. ఇక, తాజాగా ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు భారతీ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే కాగా.. పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించిన ఆయన.. దాడులను ఏమాత్రం సహించబోమని…
కరోనా తరువాత వివిధ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్లో కూడా ఈ సంక్షోభం మొదలైంది. దేశంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని ప్రజలు ఆందోళనల చేస్తున్నారు. కాగా, పెరిగిన ఈ ధరలపై పాక్ మంత్రి అలీ అమిన్ గందపూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిత్యవసర ధరలు పెరిగాయి కాబట్టి ప్రజలు తక్కువ తినాలని అన్నారు. ద్రవ్యోల్భణం గురించి బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి ఈ…
అక్టోబర్ 17 వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్రపంచ కప్ పోటీలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 24 వ తేదీన ఇండియా-పాక్ జట్ల మధ్య టీ 20 మ్యాచ్ జరగబోతున్నది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరు దేశాల జట్లు ప్రయత్నం చేస్తుంటాయి. ఇప్పటి వరకు ఇండియా-పాక్‌లో 6సార్లు తలపడగా 5 సార్లు ఇండియా విజయం సాధించింది. ఒక మ్యాచ్…
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో దాదాపుగా 15 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో ఆ భూకంపం సంభవించింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6 గా నమోదైంది. భూకంపాలు సంభవించే జోన్లో…
జమ్మూ కాశ్మీర్లో మరో కుట్ర చేసేందుకు పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడేందుకు పరోక్షంగా పాక్ సహకరిస్తూనే డ్రోన్ల ద్వారా ఆయుధాలను దేశ సరిహద్దుల్లో జారవిడుస్తోంది. ఇప్పటికే ఇలాంటి డ్రోన్లను ఆర్మీ అధికారులు బోర్డర్లో గుర్తించి వాటిని పేల్చి వేశారు. కాగా తాజాగా మరో డ్రోన్ ఇండియా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ఓ ఏకే 47 తుపాకీ, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, ఓ టెలిస్కోపును పసుపురంగు ప్యాకెట్లో ప్యాక్ చేసి అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల…
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రస్తుతం ఆరేబియా సముద్రంలో కేంద్రీకృతమై తుఫాన్‌గా మారి సెప్టెంబర్ 30న పాకిస్థాన్ వైపుగా దూసుకోస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ గులాబ్ తుఫాన్ కళింగపట్నం- గోపాలపూర్ మధ్య తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా భారత్‌లో కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గుజరాత్ దిశగా రావడంతో గుజరాత్‌లోనూ పక్కనే ఉన్నఖంభాట్ గల్ఫ్‌లోనూ ఒక మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో…
పాక్‌లో ఉద్రవాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. పాక్‌లో ఉన్న ఆ ఉగ్రసంస్థలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో మారణహోమాలను సృష్టిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు పాక్ ఇంటిలిజెన్స్ సహకారం ఉందనన్నది బహిరింగ రహస్యమే. ఇక ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ పాక్‌లోని ఉగ్రసంస్థలపై కీలక పరిశోధన చేసింది. టెర్రరిస్ట్ అండ్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్థాన్ పేరిట ఓ నివేదికను తయారు చేసి క్వాడ్ సదస్సు రోజున రిలీజ్…
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్.. ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తోంద’ని భారత్ మండిపడింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ వల్ల.. మొత్తం ప్రపంచం ఇబ్బందులు పడుతోందని భారత్ స్పష్టంచేసింది. తనవైపు ఇన్ని తప్పులు పెట్టుకొని అంతర్జాతీయ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ పదునైన వ్యాఖ్యలతో పాకిస్థాన్‌కు దిమ్మతిరిగిపోయే బదులిచ్చారు మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన స్నేహా ఐరాసలో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు అంశాన్ని లేవనెత్తారు. దీనిపై…
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్లకు పాక్ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటులో ఆ దేశం కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, దోహ ఒప్పందం ప్రకారం సమీకృత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ, ఆఫ్ఘనిస్తాన్ దానికి విరుద్ధంగా తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా వంటి సీనియర్…