పొట్ట చేత్తో పట్టుకొని ఓ వ్యక్తి తెలియకుండానే బోర్డర్ దాటి వేరే దేశంలోకి అడుగుపెట్టాడు. అలా వచ్చిన వ్యక్తిని బోర్డ్‌లో కాకుండా వేరే నగరంలో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద లభించిన మ్యాపులను బట్టి అతను పక్కదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించి జైలుకు తరలించారు. ఉపాదికోసం వచ్చిన వ్యక్తి అయినప్పటికీ బోర్డర్ దాడటంతో అతనికి 16 ఏళ్ల జైలు శిక్షను విధించారు. జైల్లో శిక్షను అనుభవిస్తూనే, జీవితానికి సరిపడా జీవితసారాన్ని తెలుసుకున్నాడు. ఏనాడు జైల్లో సమయాన్ని వృధా…
తాలిబన్లు రెండోసారి ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. 1994లో మొదటిసారి తాలిబన్లు ఆఫ్ఘన్ దురాక్రమణకు పూనుకోవడం, 1996లో అధికారంలోకి రావడంతో ఆక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రమే కాకుండా పాక్‌లోనూ తాలిబన్లు వారి ఉనికిని చాటుకున్నారు. 9 ఏళ్ల క్రితం తాలిబన్లు పాక్‌లోని క్వెట్టా ప్రాంతంలోకి ప్రవేశించి స్కూల్ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విద్యార్ధిని మలాలా యూసెఫ్జాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత ఆమెను పెషావర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడి…
తాలిబన్లకు అన్ని విధాలుగా సహకరిస్తోంది పాకిస్థాన్. అఫ్ఘాన్ ఆర్మీతో పోరులో తాలిబన్లకు సహకరించాయి పాక్ ఉగ్రవాద సంస్థలు. అఫ్ఘాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక POK తిరిగి వచ్చాయి ఆ ఉగ్రమూకలు. ఈ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ బయటకు వచ్చాయి. దీంతో తాలిబన్లకు.. తమ చెప్పుచేతల్లో ఉండే ఉగ్ర సంస్థల ద్వారా సహకారం అందించింది పాక్. పైకి అమెరికాకు సహకరిస్తున్నట్లే ఉన్నా.. లోలోపల మాత్రం తాలిబన్లకు సహకరించింది. ఈ విజువల్స్ ద్వారా.. పాక్ పన్నాగం బయటపడింది. ఉగ్రవాదులు తిరిగివచ్చినప్పుడు..లష్కరే తోయిబా,…
పాకిస్థాన్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు.. వైద్యం కోసమో, ఇతర అవసరాల నిమిత్తమో ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలను వెంటిపడి వేధిస్తున్నారు.. ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లాడితో ఆటోలో వెళ్తుంటే వాళ్లను బైక్స్‌పై వెంటపడి వేధించాయి అల్లరి మూకలు. ఇంతలో ఓ యువకుడు ఏకంగా ఆటో ఎక్కి… ఓ మహిళకు ముద్దుపెట్టాడు. దీంతో ఆమె భయంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా వాళ్లను వేధించడం ప్రారంభించారు ఆకతాయిలు. దీంతో ఆటోలోని రెండో మహిళ తన కాలి చెప్పును…
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడనే ఫేక్ వార్త ప్రచారంతో ట్విట్టర్ లో #RIPImranKhan అనే హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నట్టు కొన్ని ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు పెద్ద ఎత్తున సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు ట్వీట్లు కూడా చేస్తున్నారు. చివరకు ఆ వార్త ఫేక్ అని తేలింది. గతంలో ఎప్పుడో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే పాక్ అక్కడ కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెబుతూనే, ఆఫ్ఘనిస్తాన్-పాక్ సరిహద్దుల్లో 2600 కిలోమీటర్ల మేర అత్యంత వేగంగా ఇనుప కంచెను నిర్మించింది. 2 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల ఎత్తులో కంచెను నిర్మించింది. అంతేకాదు, ఈ సరిహద్దు వెంట 1000 చెక్ పోస్టులు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసింది. కేవలం 16 ప్రాంతాల నుంచి మాత్రమే…
మహారాజా రంజిత్ సింగ్ 180 వ జన్మదినం సందర్భంగా లాహోర్ పోర్టులో పాక్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ప్రావిన్స్‌ను పరిపాలించారు. లాహోర్ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఆయన పరిపాలన కాలంలో లాహోర్ అభివృద్ది జరిగింది. అయితే, మంగళవారం రోజున పాక్ అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు పోర్టులో ఏర్పాటు చేసిన మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వెంటనే అలర్ట్ అయిన…
ఆగస్టు 14 వ తేదీన పాక్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటే, ఆగస్ట్ 15 వ తేదీన ఇండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నది. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అసేతు హిమాచలం మొత్తం ఈ వేడుకల్లో పాల్గొన్నది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇండియా పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. నిఘాను, భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఆదివారం సాయంత్రం రోజున పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా సనోడా గ్రామంలో పంటపొలాల్లో పాక్ బెలూన్లు కనిపించాయి.…