IND Vs PAK: టాస్ గెలిచిన భారత్.. పంత్ స్థానంలో దినేష్ కార్తీక్‌కు చోటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind Vs Pak: ఆసియాకప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆశ్చర్యకరంగా రిషబ్ పంత్‌ను పక్కనబెట్టి అతడి స్థానంలో దినేష్ కార్తీక్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాడు. ఇప్పటివరకు ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ 14 సార్లు తలపడగా 8 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా ఆరుసార్లు పాకిస్థాన్ గెలిచింది.
అటు వందో టీ20 ఆడుతున్న కోహ్లీకి టీమ్‌మేట్స్ రోహిత్, రాహుల్, సూర్య, హార్ధిక్, పంత్ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ‘ఇదో గొప్ప అచీవ్‌మెంట్. అతనో గొప్పఆటగాడు. కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నాం. మూడు ఫార్మాట్లలో ఇంత సుదీర్ఘ క్రికెట్ ఆడేవారిని భవిష్యత్‌లో చూడలేం. అతను గ్రౌండ్‌లో ఉంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఆసియా కప్‌లో బాగా ఆడాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
Also Read
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
మరోవైపు పాకిస్థాన్ విజయంపై ఆ జట్టు కోచ్ ముస్తాక్ ధీమా వ్యక్తం చేశాడు. మెయిన్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ జట్టులో లేకపోయినా… నసీమ్ షా, దహానీ, హరీస్ రౌఫ్ మంచి ఫాంలో ఉన్నారన్నాడు. టీమిండియా టాపార్డర్‌ను ఈ ముగ్గురు బౌలర్లు వణికిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ముగ్గురిపై తమ కెప్టెన్ బాబర్ అజమ్‌కు, కోచ్‌గా తనకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. షాహీన్ అఫ్రిదీ ఉంటే… పేస్ ఎటాక్ బలంగా ఉండేదని.. అతను లేకపోయినా మిగతా ముగ్గురు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను మార్చేయగల సమర్థులు అని పేర్కొన్నాడు
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్, చాహల్, అర్ష్‌దీప్, అవేష్ ఖాన్
పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, ఫకార్ జమాన్, ఇఫ్తీకర్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, నవాజ్, షాదాబ్, దహాని, రవూఫ్, నసీమ్ షా
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!