Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పోరులో తగ్గేది లేదు అంటున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. తన బలాన్ని చూపించుకోవడానికి భారీ ఎత్తున ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మెడకు చుట్టుకున్నాయి. ఆగస్టు 20న జరిగిన ర్యాలిలో మహిళా న్యాయమూర్తిని బెదిరిస్తూ.. వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఉగ్రవాద కేసు నమోదు అయింది.
ఈ కేసు విచారణలో భాగంగా ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చారు ఇమ్రాన్ ఖాన్. ఈ సందర్భంలో హైకోర్టు వెలుపల భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. నన్ను జైలుకు పంపిస్తే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. దేశం తిరోగమనంలో ఉందని.. దీనికి ఎన్నికలు ఒక్కటే పరిష్కారం అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే మహిళా న్యాయమూర్తిపై చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబర్ 12 వరకు బెయిల్ పై ఉన్నారు.
Read Also: Top Gare: ఆ వివాదంలో ‘పుష్ప’ విలన్..
ఉగ్రవాద కేసులో పాటు ఇమ్రాన్ ఖాన్ పై పలు కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల సమయంలో అక్రమ మార్గాల ద్వారా డబ్బును కూడగట్టారనే అభియోగాలు ఉన్నాయి. ఆగస్టు 20న ఇస్లామాబాద్ లో జరిగిన ఓ ర్యాలీలో సెషన్ జడ్డి జెబా చౌదరితో పాటు పోలీసు అధికారులను బెదిరించే విధంగా వ్యాక్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మర్గల్లా పోలీస్ స్టేషన్ లో ఉగ్రవాద కేసు నమోదు అయింది. పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఎప్పుడైనా జరగవచ్చని తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగిన తర్వాత షహబాజ్ షరీఫ్ ప్రధానిగా పదవి చేపట్టారు. అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అమెరికా ఒత్తడితో పాకిస్తాన్ ప్రభుత్వం పనిచేస్తుందని చాలా సార్లు విమర్శలు గుప్పించారు.