Brother and sister met after 75 years in pakistan: స్వాతంత్య్ర సంబరాలు ఓ వైపు, భారతదేశ విజభన మరోవైపు ఇలా రెండు భావోద్వేగాలు ఒకేసారి రగిలిన వేళ ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. పాకిస్తాన్, భారత్ విభజన సమయంలో చాలా మంది మతకల్లోల్లాల్లో మరణించారు. చాలా మంది పిల్లలు అనాథలుగా మిగిలారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు ఒకరు భారత్ లో ఉంటే మరొకరు పాకిస్తాన్ వెళ్లారు. చాలా మంది పిల్లల్ని దేశవిభజన వారి తల్లిదండ్రులకు దూరం చేసింది. తాజాగా దేశ విభజన సమయంలో విడిపోయిన అన్నాచెలెలు 75 ఏళ్ల తరువాత పాకిస్తాన్ లో కలుసుకున్నారు.
విభజన సమయంలో విడిపోయిన భారతీయ సిక్కు, తన పాకిస్తానీ ముస్లిం సోదరిని పాకిస్తాన్ లోని పంజాబ్ కర్తార్ పూర్ లో కలుసుకున్నారు. 75 ఏళ్ల తరువాత కలుసుకున్న అమర్ జీత్ సింగ్, తన సోదరి కుల్సూమ్ అక్తర్ ను కలుసుకున్నారు. ఏడు దశాబ్ధాల తరువాత కలుసుకున్న వీరిద్దరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు కౌగిలించుకుని చాలా సేపు ఏడ్చారు. వీరిని చూసి స్థానికులు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు.
భారత విభజన సమయంలో అమర్ జిత్ సింగ్, తన ముస్లిం తల్లిదండ్రులతో విడిపోయారు. అమర్ జిత్ సింగ్ తో పాటు ఆయన సోదరిని తల్లిదండ్రులు ఇండియాలోనే ఉంచి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుకు వలస వెళ్లారు. 1947 సమయంలో అమర్ జిత్ సింగ్, అతని సోదరిని పంజాబ్ జలంధర్ లో విడిచివెళ్లారు. ఆ తరువాత అమర్ జిత్ సింగ్ ను సిక్కు కుటుంబం దత్తత తీసుకుని పెంచుకుంది.
Read Also: Kishan Reddy: సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవం.. వేడుకల్లో అమిత్ షా
ఇటీవల పాక్ వీసా పొందిన అమర్ జీత్ సింగ్, వాఘా అట్టారీ బార్డర్ దాటి పాకిస్తాన్ చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన సోదరి కుల్సూమ్, తన కుమారుడు షాజాద్ అహ్మద్, గ్రామస్తులతో కలిసి తన అన్న అమర్ జీత్ సింగ్ ను కలిసేందుకు వచ్చింది. తాను పాకిస్తాన్ వెళ్లిన తర్వాత జన్మించానని తన చిన్న తనంలో అన్న, అక్కలను తలుచుకుని తన తల్లి ఏడ్చేదని తెలిపింది. అయితే తన అన్నను కలుస్తానని ఊహించలేదని చెప్పింది.
అయితే కొన్నేళ్ల క్రితం ఆమె తండ్రి స్నేహితుడు సర్దార్ దారా సింగ్ పాకిస్తాన్ కు వచ్చినప్పుడు.. తన అన్న, అక్కల గురించిన సమాచాారాన్ని తల్లి చెప్పిందని.. వాళ్ల ఊరు పేరు, వాళ్ల ఇంటి చిరునామా చెప్పిందని.. దారా సింగ్ చిరునామా ప్రకారం పదవాన్ గ్రామంలో అమర్ జిత్ సింగ్ ను గుర్తించారు. వాట్సాప్ ద్వారా అన్నచెల్లెలు ఇద్దరు కలుసుకున్న తరువాత.. తాజాగా బుధవారం వారు పాకిస్తాన్ లో కలిశారు. అయితే అమర్ జిత్ సింగ్ తో ఉన్న మరో సోదరి చనిపోయింది.