Pakistan: అత్త మీద కోపం దుత్త మీద.. భారత జర్నలిస్టుపై రమీజ్ రాజా దురుసు ప్రవర్తన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ ఆసియాకప్ గెలవకపోవడంతో ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు రమీజ్ రాజా ఇండియన్ జర్నలిస్టుపై తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై పాకిస్థాన్ ఓటమితో అభిమానులు నిరాశకు గురయ్యారు..మీరు వారికి ఏం సందేశం ఇస్తారంటూ ఇండియన్ జర్నలిస్ట్ అడగ్గా.. ‘నువ్వు కచ్చితంగా భారతీయుడివై ఉంటావ్. మా ఓటమి తర్వాత భారతీయులే సంతోషంగా ఉన్నారు’ అంటూ రమీజ్ రాజా ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. అంతేకాకుండా భారత జర్నలిస్ట్ ఫోన్ లాక్కునేందుకు ఆయన ప్రయత్నించాడు. అనంతరం వెంటనే ఆ ఫోన్‌ను తిరిగి జర్నలిస్టుకు ఇచ్చేశాడు. ఈ వీడియోను సదరు జర్నలిస్టు ట్విట్టర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. తాను ఏదైనా తప్పు అడిగానా అంటూ సదరు జర్నలిస్ట్ రమీజ్ రాజాను ప్రశ్నించాడు.
Read Also:The Fabelmans : నిజంగా… స్టీవెన్ స్పీల్ బెర్గ్ అంత కష్టపడ్డాడా!?
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కాగా పాకిస్థాన్ ఓటమిపై షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓపెనర్ రిజ్వాన్ ఇన్నింగ్స్ వల్ల జట్టుకు పైసా ఉపయోగం కలగలేదని మండిపడ్డాడు. పాకిస్థాన్ టీం కాంబినేషన్ ఏమాత్రం బాగోలేదని షోయబ్ అక్తర్ విమర్శించాడు. జట్టులో చాలా విషయాలు పరిశీలించాలని సూచించాడు. ఫకార్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ అందరినీ ఒకసారి పరీక్షించాలన్నాడు. జట్టుకు వాళ్లు సెట్టవుతారో కాదో చూడాలని అక్తర్ అన్నాడు. రిజ్వాన్ దాదాపు 50బంతుల్లో 50పరుగులు చేశాడని.. దాని వల్ల పాకిస్థాన్‌కు నయా పైసా ప్రయోజనం లేదన్నాడు. బాగా ఆడి కప్‌ను గెలిచిన శ్రీలంకను అక్తర్ ప్రశంసించాడు. ఆ జట్టు కూర్పు చాలా బాగుందని అభిప్రాయపడ్డాడు.
Reaction of PCB chairman Ramiz Raja after Pakistan lose Asia Cup 2022 and looked at the reply of PCB chairman on Journalist. pic.twitter.com/3u8TLdxYNm
— CricketMAN2 (@ImTanujSingh) September 11, 2022
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..