India strong warning to Pakistan and China: దాయాది దేశం పాకిస్తాన్, డ్రాగన్ దేశం చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)పై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులో చేరడానికి మూడో దేశాన్ని ప్రొత్సహించాలని చైనా, పాకిస్తాన్ చూస్తున్న తరుణంలో భారత్ ఘాటుగా బదులిచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అరిందమ్ బాగ్చీ భారత్ నిర్ణయాన్ని వెల్లడించారు.
Manohar Lal Khattar - Pak, Bangladesh, India Can Unite: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ దేశంలో దాయాది దేశం పాకిస్తాన్, మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ లు విలీనం అవుతాయిన వ్యాఖ్యానించారు. గురుగ్రామ్ లో మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ మైనారిటీ మోర్చా శిక్షణా శిబిరంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ మోర్చాలో ఆయన సోమవారం మాట్లాడారు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక అల్లాడుతోంది. శ్రీలంక తరువాత ఏ దేశం అంటే వినిపించే పేరు పాకిస్తాన్. అయితే అక్కడ కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుందని మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ శనివారం హెచ్చరించారు. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చే రోజు దగ్గర్లో ఉందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ జార్దారీ, షరీఫ్ కుటుంబాలు మూడు నెల్లలోనే తాము అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు…
PM Narendra Modi, Pak PM Shehbaz Sharif MEETING may take place: పుల్వామా, యూరీ ఘటనల తరువాత ఇండియా-పాకిస్తాన్ సంబంధాలు క్షీణించాయి. ఈ ఘటనల తరువాత సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్ తో ఇండియా, పాకిస్తాన్ కు సమాధానం ఇచ్చింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం చాలా వరకు తగ్గింది. ఇక దౌత్యపరమైన సమావేశాలు కూడా జరగలేదు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేని విధంగా తగ్గిపోయాయి.
Pakistan Netizens demand justice after US vlogger: పాకిస్తాన్ లో అమెరికన్ మహిళపై లైంగిక దాడి సంఘటన అగ్గిరాజేస్తోంది. ఆ దేశ యువత, నెటిజెన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికన్ వ్లాగర్, టిక్ టాకర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన మహిళా వ్లాగర్ అండ్ టిక్ టాకర్ పై ఇటీవల…
పెట్రోల్, డీజిల్ ధరలు అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.. భారత్లో ఆల్టైం హై రికార్డులను సృష్టించాయి పెట్రో ధరలు.. అయితే, కేంద్రం పన్నుల్లో కొంత కోతపెట్టింది.. అదే దారిలో కొన్ని రాష్ట్రాలు కూడా అడుగులు వేశాయి.. కానీ, ఇప్పటికీ భారత్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైమాటే. ఈ సమయంలో పాకిస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. పెట్రోల్ డీజిల్ ధరను భారీగా తగ్గించింది.. పెట్రోల్ రేటును లీటరుకు 18.5 పాకిస్థాన్ రూపాయిలు అంటే భారత్ కరెన్సీ…
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీస్ సయీద్ కు చెందిన ఉగ్రసంస్థ జామాత్- ఉద్- దావా ( జేడీయూ)కు చెందిన ఇద్దరు సభ్యులను ప్రత్యర్థి గ్రూప్ కాల్చి చంపింది. ఈ ఘటన పాకిస్తాన్ లో కలకలం రేపింది. లాహోర్ కు 130 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్ జరన్ వాలా చక్ 97 జిల్లాలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. జేడీయూకు చెందిన రషీద్ అలీ, షాహిద్ ఫరూఖ్ ఇద్దరు ఈద్ అల్ అదా ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా..…
ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. లైవ్ లోనే ఓ లేడీ జర్నలిస్ట్ ఓ బాలుడి చెంపచెల్లమనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది జరిగింది మనదేశంలో కాదు పాకిస్తాన్ లో. గతంలో కూడా చాలా మంది పాక్ జర్నలిస్టుల వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఓ లేడీ జర్నలిస్ట్ కూడా చేరింది. అయితే తను చేసిన చర్యను సదరు లేడీ జర్నలిస్టు మైరా…
దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న వాహనం జారి లోయలో పడింది. దీంతో 11 మంది మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ ప్రకృతి అందాలకు నెలవు. అక్కడ ఉంటే స్వాత్ లోయ ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఈ…