Terrorist Attacks Plan in Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర కేసులో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సిటీలో పేలుళ్లకు కుట్ర పనిన్న కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అబ్దుల్ జాహిద్‌తో పాటు సమీవుద్దీన్, మాజా హాసన్ అరెస్ట్ అయ్యారు. మొత్తం ఆరుచోట్ల పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్లతో బాంబు దాడులకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఆరు ప్రాంతాలను జాహిద్ గ్యాంగ్…
EAM Jaishankar comments on Pakistan: విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఇంటర్నేషనల్ టెర్రరిజం(ఐటీ)లో ఎక్స్పర్ట్ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ వడోదరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇప్పడు ప్రపంచం ఉగ్రవాదంపై గతం కన్నా మెరుగైన అవగాహనతో ఉందని ఆయన అన్నారు. ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించదని.. ఇప్పడు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న…
Dengue outbreak In Pakistan: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్.. ప్రస్తుతం రోగాల బారినపడింది. అక్కడ ప్రజలు అనారోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు. భారీ వరదలు, వర్షాల కారణంగా ఇప్పటికే అక్కడి ప్రజలు అంటువ్యాధులతో సతమతం అవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ దేశం డెంగ్యూ కోరల్లో చిక్కుకుంది. దీనికి తోడు తీవ్ర మందుల కొరతను కూడా ఎదుర్కొంటోంది ఆ దేశం. పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్ లో గత 24 గంటల్లో 104 డెంగ్యూ కేసులు నమోదు అవ్వడం అక్కడి…
Pakistan airlines order to cabin crew is ‘wear proper undergarments’: పాకిస్తాన్ దేశం అప్పుడప్పుడు వింత ఆదేశాలు జారీ చేస్తుంటుంది. చెప్పాలనుకున్నది ఒకటైతే మరో విధంగా చెబుతూ అబాసుపాలు అవుతుంది. తాజాగా పాకిస్తాన్ ఇంటర్నెషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఇచ్చిన ఆదేశాలు ఆ దేశంలో విమర్శలకు గురువుతున్నాయి. విమాన సిబ్బందికి డ్రెస్ కోడ్ గురించి ఆదేశాలు జారీ చేసింది పీఐఏ. ఈ ఆదేశాల పట్ల అక్కడి మీడియా, నెటిజెన్లు పీఐఏ వ్యవహారశైలిపై విరుచుకుపడుతున్నాయి. పీఐఏ సిబ్బంది…
Bomb blast in Balochistan: పాకిస్తాన్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో రద్దీగా ఉండే ఓ మార్కెట్ లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ లోని కోహ్లు పట్టణంలోని ఓ స్వీట్ షాపులో ఈ పేలుడు జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఇందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన వెంటనే క్షతగాత్రులను కోహ్లులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స…
India's harsh comments on Pakistan in the UN: భారత్ మరోసారి పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. పాక్ అనుసరిస్తున్న విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని అందిస్తున్న పాకిస్తాన్ వంటి దేశం ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. జెనీవాలోని యుఎన్‌హెచ్‌ఆర్‌సి 51వ సెషన్ లో జనరల్ డిబేట్ లో భాగంగా భారత శాశ్వత…
India sends strong message to Pakistan on forcible conversion of Sikh teacher: ఏ అంతర్జాతీయ వేదికపైన కూడా పాకిస్తాన్ కేవలం భారత వ్యతిరేక మాటలే చెబుతోంది. కాశ్మీర్ లో మైనారిటీల హక్కుల గురించి మాట్లాడే దాయాది దేశం తన దేశంలో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవుల హక్కులను పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ పలు ప్రావిన్సుల్లో మైనారిటీకి చెందిన మహిళలు, బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా మతం మార్చారు.
Hindu Girl Kidnapped In Pakistan: పాకిస్తాన్ లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు ఆగడం లేదు. బలవంతంగా హిందూ బాలికలను, యువతులను అపహరించి మతం మార్చి బానిసలుగా మార్చుకుంటున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అవకాశం వస్తే కాశ్మీర్లో మైనారిటీ హక్కుల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతోంది. తన దేశంలో మైనారిటీలో జరుగుతున్న అకృత్యాల గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
India is a strong counter to Pakistan on Jammu and Kashmir: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. భారత్ తరుపున యూఏన్ లో మాట్లాడిన మొదటి కార్యదర్శి మిజితో వినిటో పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ చేసిన వ్యాక్యలన్నీ అబద్ధాలని భారత్ తిప్పికొట్టిది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంలో మునిగిపోయిందని భారత్ విమర్శించింది. ఇండియాపై ఆరోపణలు చేయడానికి ఈ అత్యున్నత…
Pakistani diplomat meeting with Sikh separatists: పాకిస్తాన్ తన తీరును మార్చుకోవడం లేదు. భారతదేశాన్ని ఇరుకున పెట్టే ప్రతీ విషయంలో భాగమవుతోంది. కెనడా కేంద్రంగా సిక్కు వేర్పాటువాదులు సిక్క రిఫరెండం ఏర్పాటు చేసిన రోజునే.. పాకిస్తాన్ అధికారులు పలువురు వేర్పాటువాద నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. కెనడాలోని కాన్సుల్ జనరల్ జన్బాజ్ ఖాన్ వాంకోవర్ నగరంలోని సర్రేలోని రెండు ఖలిస్తానీ అనుకూల గురుద్వారాలను సందర్శించారు. పాకిస్తాన్ వరద సహాయం కోసం విరాళాలు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు.…