India: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్‌ను చేర్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పెద్ద ఉగ్రవాద దాడులు తగ్గుముఖం పట్టాయని భారత ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. జ అయితే పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్ నుంచి తొలగించే అవకాశాలు పెరిగాయని, ఉగ్రవాద కార్యకలాపాలు కూడా పెరిగాయని ఆయన పేర్కొన్నారు ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ తరఫున ప్రభుత్వ కార్యదర్శి షఫీ రిజ్వీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో పాకిస్థాన్ ఉన్నంతకాలం ఉగ్ర కార్యకలాపాలు తగ్గడం.. అందులోంచి పాక్ బయటపడుతుందనే సంకేతాలు కనిపించగానే దాడులు పెరగడానికి మధ్య సంబంధం వెనకున్న గుట్టును తేల్చాలని కోరారు. ఈమేరకు ఆయన భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీకి విజ్ఞప్తి చేశారు. రిజ్వీ పాకిస్థాన్ పేరును ఏ సమయంలోనూ ప్రస్తావించలేదు ఉగ్రదాడులు తగ్గిపోయాయని పాక్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ సమావేశంలో భారత్ వెల్లడించింది. ఇటీవల ‘గ్రే లిస్ట్’ నుంచి పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్ తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ తదితర సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం పాకిస్థాన్‌కు ఏర్పడింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడిచేసే లక్ష్యాలను పాక్ అందుకోకపోవడం వల్ల ఎఫ్‌ఏటీఎఫ్ నాలుగేళ్లపాటు ఆ దేశాన్ని గ్రే లిస్ట్‌లో ఉంచింది.
జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్మీ, పోలీస్ క్యాంపులపై 2014లో జరిగిన ఉగ్రదాడుల సంఖ్య ఐదు అని రిజ్వీ తెలిపారు. 2015లో ఎనిమిది, 2016లో 15 చోట్ల ఉగ్ర దాడులు జరిగాయని వివరించారు. ఆ తర్వాత 2017 నుంచి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గుతూ వచ్చాయని అన్నారు. ఆ ఏడాది మొత్తం 8 ఉగ్ర దాడులు జరిగాయని, 2018లో 3 చోట్ల ఉగ్రవాదులు దాడి చేశారని వివరించారు. 2019లో పుల్వామా దాడి తర్వాత 2020లో ఉగ్రదాడులు చోటుచేసుకోలేదన్నారు. 2021 ఏడాది నుంచి జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు మళ్లీ పెరిగాయని రిజ్వీ వివరించారు. అయితే, 2018 నుంచి 2021 వరకు ఉగ్రదాడులు తగ్గడానికి కారణం ‘గ్రే లిస్ట్’ మాత్రమేనని సులభంగా అర్థమవుతోందన్నారు.
Agra: దారుణం.. తాగేందుకు సిగరెట్ ఇవ్వలేదని స్నేహితుడి హత్య
ఇదిలా ఉండగా.. మానవాళికి ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని, ఇది మరింత విస్తరిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో కుట్ర సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు మిలిటెంట్ గ్రూప్‌ల టూల్‌కిట్‌లో శక్తిమంతమైన సాధనాలుగా మారాయని ఆయన అన్నారు. కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త సవాళ్లను విసురుతోందన్నారు. మానవాళికి ఉన్న ఉగ్రముప్పును ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఉగ్రవాదం విస్తృతమవుతోందన్నారు. ఆసియా, ఆఫ్రికాలో ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతోందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఉగ్రవాద నిరోధక ఆంక్షలు రూపొందించడంలో, ఉగ్రసంస్థలకు నిధులు అందించే దేశాలను నోటీసులో ఉంచడంలో మండలి కీలకంగా వ్యవహరించిందన్నారు.