Imran khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను మరోసారి భారత్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనియాడారు. దేశ ప్రజల కోసం రష్యా నుంచి ధైర్యంగా చమురును కొనుగోలు చేస్తోందన్నారు. దేశ ప్రజల కోసం ఎవరికీ తలొగ్గడం లేదన్నారు. కానీ పాకిస్థానీలు బానిసలుగా మారిపోయారని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి వారికి అనుమతి లభించడం లేదని విమర్శలు గుప్పించారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలు దేశం లోపలే తీసుకోవాలని పరోక్షంగా పాకిస్థాన్‌పై అగ్రదేశాల పెత్తనం ఎక్కువైందన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చారు. తానే గనుక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉంటే ఎవరితో సంబంధం లేకుండా, రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తానని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు.
Cylinders Blast: ఛఠ్ పూజ వేళ అపశృతి.. పేలిన సిలిండర్లు, పలువురి పరిస్థితి విషమం
ముందస్తు ఎన్నికల కోసం డిమాండ్ చేస్తున్న ఆయన ఇస్లామాబాద్ నుంచి లాంగ్ మార్చ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. క్రికెటర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన ఇమ్రాన్ ఖాన్, భారీ ర్యాలీలో ప్రసంగించారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ భారత్‌ను పొగడడం ఇదే తొలిసారి కాదన్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగిన తర్వాత ఆయన పలుసార్లు భారత విదేశాంగ విధానాన్ని కొనియాడారు.