ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణు దాడి చేస్తే.. పాకిస్థాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణు దాడి చేస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లో సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మొహ్సేన్ రెజాయ్ హెచ్చరించారు.
Himanta Biswa Sarma: పాకిస్తాన్‌ని అణ్వాయుధ దేశం మారేందుకు కాంగ్రెస్ చేసిన ‘‘చారిత్రక తప్పిందాలు’’ కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. పాకిస్తాన్ తాను చేస్తున్న ఉగ్రవాదానికి, పరోక్ష యుద్ధానికి ‘‘అణు బ్లాక్మెయిల్’’ని వాడుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం, చాలా దేశాలు అణు బెదిరింపులను తటస్థీకరించేందుకు నిర్ణయాత్మంగా వ్యవహరిస్తున్న సమయంలో, 1980లలో భారత నాయకత్వం పాకిస్తాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు షేర్ చేశారు.
Israel-Iran war: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మిడిల్ ఈస్ట్ దేశాలను ఆందోళనపరుస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయిల్‌పై వందలాది క్షిపణులతో దాడులు చేసింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీప దేశం సైప్రస్ చేసుకున్నారు. మోడీ లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ప్రోటోకాల్ పక్కనపెట్టి, స్వయంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు, ప్రధాని జూన్ 15-16 తేదీల్లో సైప్రస్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు. జూన్ 16-17 తేదీల్లో కెనడాలో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి వెళ్తున్న ప్రధాని మోడీ, మార్గం మధ్యలో…
ముగిసిన నీటిపారుదల శాఖ ఏఈ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు కరీంనగర్‌కు చెందిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీధర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం తెల్లవారుజామున భారీగా దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్‌పై నమోదైన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు, పెద్దఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి తీసుకొచ్చారు. కరీంనగర్, సిద్ధిపేట్, వరంగల్, హైదరాబాద్ సహా…
US Invited Pak Army Chief: భారత్, పాకిస్తాన్ విషయంలో మరోసారి తన వక్రబుద్దిని బయట పెట్టింది అగ్రరాజ్యం అమెరికా. తమకు ఇండియా మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసేందుకు భారీ ప్లాన్ వేసింది.
India vs Pakistan: పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లోని హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై మోడీ సర్కార్ ప్రణాళికలు రెడీ చేస్తోందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.
Pakistan: ఆపరేషన్ సిందూర్ నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో సమాధానం చెప్పింది. ముందుగా, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేసింది. అ
S Jaishankar: యూరోపియన్ యూనియన్ నేతలతో చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రస్సెల్స్‌లో ఉన్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ తీరును మరోసారి ఆయన ఎండగట్టారు. కాశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణను ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలుగా చూడాలని, కేవలం ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యగా చూడొద్దని వెస్ట్రన్ దేశాలకు పిలుపునిచ్చారు.
S Jaishankar: పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తే భారత్ దానిని లక్ష్యంగా చేసుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఫ్రాన్స్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ని టార్గెట్ చేస్తూ హెచ్చరించారు. ‘‘వారు ఎక్కడ ఉన్నారో మాకు పట్టింపు లేదు. వారు పాకిస్తాన్లో ఉంటే, మేము పాకిస్తాన్లోకి వెళ్తాము’’ అని అన్నారు.