Pakistan: ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన తర్వాత పాకిస్తాన్‌లో ఏం జరిగింది.? లాడెన్ భార్యల్ని పాక్ ఏం చేసింది..?
- యూఎస్ లాడెన్‌ను చంపిన తర్వాత పాకిస్తాన్‌కు ఘోర అవమానం..
- 2011లో అబోటాబాద్‌లో అల్‌ఖైదా అధినేతను హతమార్చిన నేవీ సీల్స్..
- ఆనాటి విషయాలపై జర్దారీ సన్నిహితుడి పుస్తకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అల్ ఖైదా అధినేత, అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను యూఎస్ బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో హతమార్చాయి. 2001 సెప్టెంబర్ 11 దాడులు జరిగిన దాదాపు 10 ఏళ్ల తర్వాత లాడెన్ జాడను కనిపెట్టి, 2011 మే 2న యూఎస్‌కు చెందిన నేవీ సీల్స్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, హతం చేశాయి. సైనిక కంటోన్మెంట్ ఉండే అబోటాబాద్‌లో లాడెన్ సురక్షితంగా తలదాచుకున్న విషయం అందర్ని ఆశ్చర్యపరిచింది. మరోసారి, టెర్రరిజానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందని ఈ ఘటన రుజువు చేసింది. సైనిక కంటోన్మెంట్‌కు కూతవేటు దూరంలోని ఒక భవనంలో బిన్ లాడెన్ ఉండటం సంచలనంగా మారింది.
అయితే, బిన్ లాడెన్‌ను చంపిన తర్వాత, పాకిస్తాన్‌లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే విషయాన్ని అప్పటి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సహాయకుడు, ఫర్హతుల్లా బాబర్ రచించిన ‘‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్’’ పుస్తకంలో వివరించారు. ఆ రోజు పాకిస్తాన్ నిఘా వైఫల్యం కొట్టచ్చినట్లు కనిపించిందని, పాకిస్తాన్ నడిబొడ్డున అమెరికన్ విమానాలు ఎగురుతున్నా, బిన్ లాడెన్ తమ దేశంలో ఉన్నాడనే విషయాన్ని నిఘా వర్గాలు కనిపెట్టకపోవడం సిగ్గు చేటుగా భావించినట్లు చెప్పారు. ఈ ఉదంతాన్ని దేశానికి ‘‘జాతీయ అవమానం’’గా బాబర్ పేర్కొన్నాడు. ఈ ఘటన పాకిస్తాన్ వైఫల్యం, ఇబ్బందిని కలిగించిందని చెప్పాడు.
Also Read
Read Also: Prakasam : ప్రకాశం జిల్లా జే. పుల్లలచెరువు వద్ద తృటిలో తప్పిన ప్రమాదం.. స్థానికుల్లో ఆందోళన
అమెరికా ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్తాన్ లోని సంకీర్ణపాలనలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ), పీఎంఎల్ క్యూ మధ్య క్యాబినెట్ పదవుల కోసం తగదా నడుస్తోందని బాబర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే జర్దారీ ఉదయం 6.30 గంటలకు విదేశాంత మంత్రి హీనారబ్బానీ ఖర్, విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్‌తో సమావేశమయ్యారని చెప్పాడు. ఈ ఘటన దేశానికి రెండు మార్గాలను మాత్రమే మిగిల్చిందని, ‘‘సహకరించడం లేదా పూర్తి అసమర్థత’’ మరేమీ కాదని జర్దారీ అన్నట్లు బాబర్ గుర్తు చేసుకున్నారు. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించారు.
ఈ ఘటనలో ఎవరిని శిక్షించలేదు, సైనిక జనరల్స్ పై ఒక విదేశం ఇచ్చిన సలహాతో జర్దారీ చర్యలు తీసుకోలేదని పుస్తకంలో వివరించారు. ఈ ఘటన నాయకుల్లో సంకల్పం లేకపోవడాన్ని, సైన్యం దాని అహంకారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించిందని బాబార్ చెప్పాడు. ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, సెనెటర్ జాన్ కెర్రీలు పాకిస్తాన్ సందర్శనకు వచ్చారు. బిన్ లాడెన్ ఘటన తర్వాత, అమెరికా ఏకపక్ష దాడులు చేయవద్దని పాకిస్తాన్ హామీ కోరిందని, అయితే వాషింగ్టన్ అందుకు నిరాకరించినట్లు బుక్‌లో చెప్పాడు.
లాడెన్ మరణించిన తర్వాత అతడి భార్యలను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని, అయితే, ఆశ్చర్యకరంగా ఒక సీఐఏ బృందం అబోటాబాద్ కంటోన్మెంట్‌కు నేరుగా ప్రవేశం పొంది మహిళల్ని విచారించిందని, ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారంపై తీవ్రమైన ఆందోళనల్ని రేకెత్తించిందని బాబర్ పుస్తకంలో చెప్పాడు. పాకిస్తాన్ గడ్డపై అమెరికన్ ఏజెంట్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, దేశ నాయకత్వం, సైన్యం ఒత్తిడికి లోనైనట్లు కనిపించిందని ఆయన రాశారు.
తాజావార్తలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
-
Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!