పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ దౌత్య ప్రచారంలో, వాషింగ్టన్ డిసిలో ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. భారత అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, వాషింగ్టన్ పోస్ట్‌లో పనిచేస్తున్న తన కుమారుడు ఇషాన్ థరూర్ ప్రశ్నలు అడిగాడు. వాషింగ్టన్ పోస్ట్ గ్లోబల్ అఫైర్స్ కాలమిస్ట్ ఇషాన్ థరూర్ ఒక ప్రశ్న అడగడానికి లేచి నిలబడగా, థరూర్ నవ్వుతూ, “దీన్ని అనుమతించకూడదు. ఇతను నా కొడుకు”…
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం కాగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి.
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్‌పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. ఫలితమే ప్రధానం అన్నారు.
Maulana Abdul Aziz: పాకిస్తాన్లో వరసగా కీలక ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ సోమవారం పాకిస్తాన్లో బహవల్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Honour Killing: పరువు హత్యలకు కేరాఫ్‌గా ఉన్న పాకిస్తాన్లో మరో హత్య జరిగింది. 17 ఏళ్ల యువతిని సొంత బంధువుల్లో ఒకరు కాల్చి చంపారు. టిక్ టాక్ ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకున్న సనా యూసఫ్‌ని ఇస్లామాబాద్‌లో తన ఇంట్లోనే చంపారు. ఇది పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా ఆమెకు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సనా యూసుఫ్‌ని బంధువు అతి దగ్గర నుంచి చంపినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం చెప్పిన దాని కన్నా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు ఆ దేశ పత్రాలు బయటపెట్టాయి. భారత్ పేర్కొన్న దాని కన్నా అదనంగా మరో 8 ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు చెప్పింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్, పీఓకే లోని 09 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.
Himanta Biswa Sarma: చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే పరిస్థితి ఏమిటి..? అని దానిపై అస్సా సీఎం హిమంత బిశ్వ సర్మ స్పందించారు. దీనిపై ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ‘‘భయంతో కాదు, వాస్తవాలు, నేషనల్ క్లారిటీతో ఈ అపోహను తొలగిస్తాం’’ అని అన్నారు. బ్రహ్మపుత్ర భారత్‌కి చేరిన తర్వాత పెరిగే నది అని, కుచించుకుపోయే నది కాదని ఆయన తెలిపారు.